Dinesh Karthik : కాఫీ కూడా తాగ‌నివ్వ‌లేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నం పై దినేశ్ కార్తీక్‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కాస్త ఆల‌స్యంగా పుంజుకున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుసగా మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

RCB – Dinesh Karthik : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కాస్త ఆల‌స్యంగా పుంజుకున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుసగా మూడో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 13.4 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కాగా.. ఓ మోస్త‌రు ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ ఓపెన‌ర్లు ఫాప్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో ప‌వ‌ర్ ప్లే ఆరు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్‌సీబీ వికెట్ న‌ష్ట‌పోయి 92 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఈజీగానే గెలుస్తుంద‌ని, త‌న‌కు బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాద‌ని ఆ జ‌ట్టు ఫినిష‌ర్ దినేశ్ కార్తీక్ భావించాడు.

IPL 2024 : లక్నో జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు దూరమైన ఫాస్ట్ బౌలర్.. అసలేం జరిగిందంటే?

అందుక‌నే ఓ క‌ప్పు టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు. అయితే.. అనూహ్యంగా ఆర్‌సీబీ త‌డ‌బ‌డింది. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో విల్‌జాక్స్ (1), ర‌జ‌త్ పాటిదార్ (4), మాక్‌వెల్ (4), కామెరూన్ (1) లు ఔట్ కాడంతో 111/5 తో నిలిచింది. దీంతో కార్తీక్ బ్యాటింగ్‌కు రావాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో తాను మాన‌సికంగా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా లేన‌ట్లు కార్తీక్ చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ 12 బంతుల్లో 3 ఫోర్లు బాది 21 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు.

దీనిపై మ్యాచ్ అనంత‌రం కార్తీక్ మాట్లాడుతూ.. ‘ప‌వ‌ర్ ప్లేలో బ్యాట‌ర్లు అద్భుతంగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్ల త‌రువాత నేను క్యాప‌చీనో తెచ్చుకుని తాగుతూ రిలాక్స్ అవుతున్నాను. ఈ మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని భావించాను. అందుక‌నే ప్యాడ్లు కూడా క‌ట్టుకోలేదు. మాన‌సికంగా సిద్ధంగా లేను. ఎంజాయ్ చేస్తూ ఉన్నాను.’ అని కార్తీక్ చెప్పాడు.

IPL 2024 : ఆర్సీబీ దెబ్బకు పాయింట్ల పట్టికలో కిందకు వెళ్లిపోయిన మూడు జట్లు

‘అయితే.. అన్ని మ‌నం అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌వు క‌దా..వికెట్లు కోల్పోవ‌డంతో నేను ప్యాడ్లు క‌ట్టుకుని బ్యాటింగ్ వ‌చ్చాను. మాన‌సికంగా సిద్ధంగా లేన‌ప్ప‌టికీ నేను సాధించ‌గ‌లిగాను.’ అని కార్తీక్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ విజ‌యాల సంఖ్య నాలుగుకు చేరింది. 8 పాయింట్ల‌తో ఆఖ‌రి స్థానం నుంచి ఏడో స్థానానికి దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు