Cheteshwar Pujara : నేనింకా రిటైర్ కాలేదు.. సెల‌క్ట‌ర్ల‌కు స్ట్రాంగ్ మెసేజ్ పంపిన పుజారా!

తానింకా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌లేద‌ని, రేసులోనే ఉన్న‌ట్లు టీమ్ఇండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా సెల‌క్ట‌ర్ల‌కు మెసేజ్ పంపాడు.

Pujara : తానింకా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌లేద‌ని, రేసులోనే ఉన్న‌ట్లు టీమ్ఇండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా సెల‌క్ట‌ర్ల‌కు మెసేజ్ పంపాడు. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు టెస్టుల్లో పుజారా లేకుండా టీమ్ఇండియా బ‌రిలోకి దిగేది కాదు. అంత‌లా త‌న‌దైన ముద్ర వేశాడు. అయితే ప‌రిస్థితి మారిపోయింది. ఫామ్‌లేమీ, కుర్రాళ్ల జోరు కార‌ణంగా అత‌డికి జ‌ట్టులో చోటు క‌రువైంది. జూన్ 2023లో లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో చివ‌రి సారిగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ మ్యాచ్‌లో 14, 28 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఘోరంగా విఫ‌లం అయ్యాడు.

టెస్టు ఆట‌గాడు అని ముద్ర ప‌డ‌డంతో ఐపీఎల్‌లో అత‌డిని ఏ ఫ్రాంచైజీ తీసుకోవ‌డం లేదు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దీంతో పుజారా ఇంగ్లాండ్ బాట ప‌ట్టాడు. అక్క‌డ కౌంటీ ఛాంపియ‌న్ షిప్‌లో ఆడుతూ దుమ్ములేపుతున్నాడు. ససెక్స్ జ‌ట్టు త‌రుపున ఆడుతూ డెర్బీషైర్ పై శ‌త‌కంతో చెల‌రేగాడు. 104 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. పుజ‌రా ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది 64వ శ‌త‌కం కావ‌డం విశేషం.

Dinesh Karthik : కాఫీ కూడా తాగ‌నివ్వ‌లేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నం పై దినేశ్ కార్తీక్‌

పుజారా సెంచ‌రీ చేయ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి స‌సెక్స్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 357 ప‌రుగుల‌తో నిలిచింది. డెర్బీషైర్‌పై 111 పరుగుల ఆధిక్యంతో కొన‌సాగుతోంది.

సెల‌క్ట‌ర్ల‌కు మెసెజ్‌..!

తాజా శ‌త‌కంతో పుజారా భార‌త సెల‌క్ట‌ర్ల‌కు గ‌ట్టి సందేశం పంపిన‌ట్లైంది. తాను ఫామ్‌లోకి వ‌చ్చాన‌ని, ఈ ఏడాది ఆఖ‌ర్లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు త‌న‌ను త‌ప్ప‌క ఎంపిక చేయాల్సిన‌ ప‌రిస్థితిని క‌ల్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం పుజారా భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై మూడు ఇన్నింగ్స్‌ల్లో 234 ప‌రుగులు చేశాడు. కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లీష్ కౌంటీల్లో మూడు సీజ‌న్ల‌ల‌లో అత‌డికి ఇది తొమ్మిదో శ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం.

Rohit Sharma : హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడ‌డంపై తొలిసారి స్పందించిన రోహిత్ శ‌ర్మ‌

మ‌రీ రీ ఎంట్రీ కోసం ప‌రిత‌పిస్తున్న పుజ‌రాను సెల‌క్ట‌ర్లు క‌రుణిస్తారో లేదో మ‌రికొన్నాళ్లు ఆగితే గానీ తెలియ‌దు.

ట్రెండింగ్ వార్తలు