Irwin Mango: ఒక్కో మామిడి పండు రూ.13 వేలు.. ఇవి ఇంత ధర ఎందుకో తెలుసా?

మన దేశంలో మామిడి పండంటే మహా అయితే ఇరవయో ముప్పాయో ఉంటుంది. కాదు కూడదు.. కాస్త కాస్ట్ లీ ఏరియాలో కాస్ట్ లీ మాల్ లో కొంటే ఓ వంద ఉంటుంది. అదే ఫ్రూట్ మార్కెట్ కు వెళ్తే కిలో వందకు కవర్ లో పెట్టి మన చేతికి ఇస్తారు. ఇంతవరకే మనకు తెలుసు.

Irwin Mango: మన దేశంలో మామిడి పండంటే మహా అయితే ఇరవయో ముప్పాయో ఉంటుంది. కాదు కూడదు.. కాస్త కాస్ట్ లీ ఏరియాలో కాస్ట్ లీ మాల్ లో కొంటే ఓ వంద ఉంటుంది. అదే ఫ్రూట్ మార్కెట్ కు వెళ్తే కిలో వందకు కవర్ లో పెట్టి మన చేతికి ఇస్తారు. ఇంతవరకే మనకు తెలుసు. కానీ ఒక్క మామిడి పండు ధర రూ.13 వేల రూపాయలంటే అది మనం కొనేది.. తినేది నిజమేనా అనుకోవాల్సిందే. కానీ అసలు ఈ మామిడి పండు ఎందుకింత స్పెషల్.. మన మామిడి పండులో కన్నా ఆ పండులో ఏముందని అంత ధర. మన దగ్గరుండే ఇన్ని రకాల వెరైటీ మ్యాంగోస్ లో లేనిది ఆ మ్యాంగోలో ఏముందో కనీసం తెలుసుకుందాం.

Irwin Mango

ఇదిగో మీరు ఫోటోలో చూసిన ఈ మామిడి పండు పేరు ఇర్విన్ మామిడి. ఈ ఇర్విన్ మామిడి పండ్లు కూడా చెట్టుకే కాస్తాయి కానీ మన లాగా పండకుండా మాత్రం కాయను చెట్టు నుండి తెంపరు. కాయ చెట్టునే పూర్తిగా పండిన తర్వాత చాలా రకాల కొలతలేసి మరీ తెంపుతారు. జస్ట్ తెంపడమే కాదు.. మొక్క నుండి చెట్టు వరకు అన్నీ కొలతలేసి చేయాల్సిందే. జపాన్ దేశంలో 2007 నుంచి ఒకినావా ప్రాంతంలో పండే ఈ ఇర్విన్ జాతి మామిడిని కేవలం గ్రీన్ హౌస్‌లలోనే పెంచుతారు.

Irwin Mango

మొక్కగా ఉన్నప్పటి నుండే ప్రతీ కొమ్మకూ దారం కట్టి కొమ్మ ఊగకుండా.. పైకి పెరగకుండా చేస్తారు. అందుకే ఈ చెట్టు తక్కువ ఎత్తులో బలంగా తయారవుతుంది. చెట్టు పూత దశకు రాగానే బాక్సుల్లో తేనెటీగల్ని తెచ్చి వదులుతారు. ఆ ఈగలు ఆ పువ్వులపై వాలి పుప్పొడిని అంతటా చేర్చడంతో పిందెలు మొదలవుతాయి. అప్పుడు ఒక కొమ్మకు ఒక కాయనే ఉంచి మిగతా వాటిని కట్ చేసేస్తారు. దీంతో ఆ కాయ బలంగా మారుతుంది. అప్పుడు ప్రతి కాయని నెట్ లో సేఫ్ గా కింద పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

Irwin Mango

అలా పండిన కాయలను కోసి కంప్యూటర్‌తో పండులో ఎంత తీపి ఉంది.. ఎంత బరువు ఉందో చెక్ చేస్తారు. తీపి 16 బ్రిక్స్, బరువు 400 గ్రాములు ఉంటేనే దాన్ని ప్యాక్ చేసి మిగతా వాటిని పక్కనపెడతారు. అలా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ఈ ఇర్విన్ మామిడి పండు చాలా స్మూత్‌గా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. జ్యూస్ చాలా ఎక్కువగా ఉంటూ మంచి సువాసన కలిగి ఉంటుంది. మొక్క నుండి ఎక్స్ పోర్ట్ వరకు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచడంతో పాటు ఇందులో ఉండే తీపి, కేలరీలు, షుగర్ సమపాళ్ళలో ఉంటాయి కనుకే ఈ పండు ఇంత ఖరీదు పలుకుతుంది.

Read: Car bomb Blast in Afghanistan: ఆఫ్ఘ‌న్‌ బాంబు పేలుడు.. 30కి చేరిన మృతులు!

ట్రెండింగ్ వార్తలు