తడిసిన ఉప్పల్ స్టేడియం.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? భారీ వర్షంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

Rains: రోడ్లపై నిలిచిపోయిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్ప‌ల్ స్టేడియం తడిసిపోయింది. ప్ర‌ధాన పిచ్‌పై క‌వ‌ర్లు క‌ప్పారు గ్రౌండ్ సిబ్బంది. మ‌రో నాలుగు రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఎస్ఆర్‌హెచ్ వ‌ర్సెస్ ల‌క్నో మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు నెలకొన్నాయి.

పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న డీఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. వర్షం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్.

రోడ్లపై నిలిచిపోయిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫోన్లను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. సిటిజన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు.

వర్షపాతం వివరాలు

  • జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • కూకట్‌పల్లి ఏరియాలో మూసాపేట సర్కిల్ పరిధిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం
  • యూసఫ్‌గూడా సర్కిల్ పరిధిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం
  • శేరిలింగంపల్లి, చందానగర్, హైటెక్ సిటీ, రామచంద్రపురం, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, బాలానగర్, చింతల్ తదితర ప్రాంతాల్లో మూడున్నర సెంటీమీటర్ల వర్షపాతం

ఇప్పటికే 50 ఫిర్యాదులు
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 50 ఫిర్యాదులు వచ్చాయి. 74 ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయినట్లుగా గుర్తించారు అధికారులు. భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రేవంత్ రెడ్డి సభ కోసం వేసిన టెంట్లు కూలిన వైనం

ట్రెండింగ్ వార్తలు