Munugodu By poll :తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు..ఇక మునుగోడులో మునగటం ఖాయం..: గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేస్తే నిండా మునిగిపోవటం ఖాయం అంటూజోస్యం చెప్పారు.

Munugodu By poll : శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోపాల్ రెడ్డిపై గుత్తా తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చూసుకుని  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేస్తే నిండా మునిగిపోవటం ఖాయం అంటూజోస్యం చెప్పారు. అంతేకాదు తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ తరపున తాను మునుగోడులో పోటీ చేస్తాననే ప్రచారంలో వాస్తవం లేదని..అటువంటి ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు గుత్తా.

మునుగోడులో పోటీ చేసే అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని..స్వార్థ ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే ఏవేవో మాట్లాడుతున్నారని..అతని చెప్పే మాటలల్లో ఏమాత్రం వాస్తవాలులేవని అన్నారు గుత్తా. మునుగోడు నియోజకవర్గంలో తిరిగి తాను గెలుస్తాను అనే అతి నమ్మకంతో రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేసిన ఆయన మునుగోడులో మునగటం ఖాయం అని టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఉన్నదాని కంటే ఎక్కువగా తామే తోపులం అని ఊహించుకోవటం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ముందునుంచి అలవాటేనని..అదే అత్యుత్సాహంతో రాజీనామా చేశారని..ఇప్పటికే ఉన్నది పోయింది. ఇక తిరిగి లభిస్తుందనే ఊహల్లో రాజగోపాల్ ఉన్నారని ఆ ఊహలకు టీఆర్ఎస్ చెక్ పెట్టి మునుగోడులో ఘనవిజయం సాధిస్తుంది అని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి సీనియర్ నేతలు ఎవ్వరు మద్దతు ఇవ్వలేదని..తాను, జానారెడ్డి నిలబడి అందరిని కన్విన్స్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాము అని గతంలో తాను కాంగ్రెస్ లో ఉన్న సందర్భాన్ని గుత్తా గుర్తు చేశారు. బీజేపీ తరపున పోటీచేస్తే రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అని గుత్తా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను గెలవను అని రాజగోపాల్ రెడ్డికి తెలుసని..కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ గుత్తా ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలో వామపక్షాలకు 15వేల ఓట్లు నిరకంగా ఉంటాయని..కాంగ్రెస్ ఓట్లను రాజగోపాల్ రెడ్డి 20 నుంచి 30 శాతం వరకు ప్రభావితం చేయగలరు అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు