×
Ad

Gudivada Amarnath : అందుకే.. జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు- మంత్రి గుడివాడ

ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?

  • Published On : May 6, 2024 / 10:47 PM IST

Gudivada Amarnath (Photo Credit : Facebook)

Gudivada Amarnath : ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో జగన్ సర్కార్ పై ప్రధాని మోదీ చేసిన విమర్శలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పకొట్టారు. చంద్రబాబు స్కిప్ట్ ను ప్రధాని మోడీ చదివారని విమర్శించారు. ఇన్నాళ్లూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాజకీయ అవసరాలతోనే ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు.

ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని చెబితే నేను రాజకీయాల నుండి తప్పకుంటానని చెప్పాను. అది జరగలేదు. కేవలం ఓట్లు సీట్లు కోసమే ఈ సభ జరిగింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఓట్లు పడతాయని బీజేపీ అనుకుంటోంది. రేపు(మే 7) గాజువాకలో సీఎం జగన్ ప్రచార సభ ఉంది. అక్కడ అన్నింటికీ జగన్ సమాధానం చెబుతారు” అని మంత్రి అమర్నాథ్ అన్నారు.

Also Read : ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోంది: అధికారుల బదిలీపై జగన్ సంచలన కామెంట్స్