ఢిల్లీ ఘటన మరవకముందే మరోసారి వార్నింగ్.. బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ అహ్మదాబాద్

Ahmedabad: అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారా అని ఇంటర్నల్‌గా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఎవరు మెయిల్ పంపుతున్నారో తెలియదు. ఎక్కడి నుంచి పంపుతున్నారో అంతకన్నా తెలియదు. కానీ వరుసపెట్టి స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. వందల మంది పిల్లలుండే స్కూళ్లకు బాంబు థ్రెటెనింగ్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలో ఇలాగే 150కి పైగా స్కూళ్లకు నాలుగురోజుల క్రితమే బాంబు బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు స్కూళ్లను తనిఖీలు చేశారు. ఢిల్లీలోని పాఠశాలల నుంచి పిల్లలను ఇంటికి పంపించేసి.. పోలీసులు, భద్రత సిబ్బంది స్కూళ్లను జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు ఆచూకీ దొరకలేదు.

ఢిల్లీలో స్కూళ్లను సెర్చ్ చేసిన పోలీసులకు పేలుడు ఆనవాళ్లు ఏమీ దొరకలేదు. మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేశారు పోలీస్ అధికారులు. రష్యన్ ఐపీ అడ్రస్‌ నుంచి తౌహీద్ అనే ఐడీ నుంచి అరబిక్ భాషలో మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. సవారీమ్ అనే పదంతో మెయిల్ వచ్చిందని..సవారీమ్‌ అంటే అరబిక్‌లో కత్తుల ఘర్షణ అని అర్థమని అంటున్నారు అధికారులు. ఇస్లామిక్ ప్రచారం కోసం 2014 నుంచి ఐఎస్ ఈ పదాన్ని ఉపయోగిస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఆరు స్కూళ్లకు..
ఇప్పుడు అహ్మదాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉన్నట్లుండి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం.. పోలీసులు తనిఖీలు చేయడంతో ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు స్కూళ్ల నిర్వాహకులు టెన్షన్ పడ్డారు. అహ్మదాబాద్‌లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాలలను డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ చేశారు పోలీసులు. కానీ ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో..పాఠశాలల యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు.

అహ్మదాబాద్ స్కూళ్లకు కూడా రష్యన్‌ సర్వర్‌ నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని చెప్తున్నారు పోలీస్ అధికారులు. అరబిక్‌ భాషలో మెయిల్ ఉందని తెలిపారు. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు రావడంతో హైటెన్షన్ ఏర్పడింది. ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా తనిఖీలు చేస్తున్నారు.

బాంబు బెదిరింపులు వచ్చిన ఢిల్లీ స్కూళ్లలో ఏం దొరకలేదు. అహ్మదాబాద్ స్కూళ్లలోనూ ఎలాంటి పేలుడు ఆనవాళ్లు కనిపించలేదు. ప్రస్తుతానికి థ్రెట్ లేదని పోలీసులు కాస్త రిలీఫ్‌ అయినా..అసలు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వెనక కథేంటో తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

పక్కా స్కెచ్‌ ప్రకారమేనా?
ఈ బెదిరింపులను లైట్ తీసుకోవాలా.. లేక పక్కా స్కెచ్‌ ప్రకారమే ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపిస్తున్నారా..అని తేల్చే పనిలో పడ్డారు. ఇది ఉగ్రవాదుల పనా లేక ఆకతాయిల నుంచి వచ్చిన ఫేక్ మెయిల్సా అని ఆరా తీస్తున్నారు. ఐపీ అడ్రస్‌ను బట్టి చూస్తే దేశం అవతలి నుంచే మెయిల్స్ వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఈ మెయిల్స్ వ్యవహారం వెనక ఒకే వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మెయిల్స్‌ను బట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనే అని స్పష్టతకు రాలేమంటున్నారు పోలీస్ అధికారులు. ఉగ్రవాదుల పేరుతో ఇంకెవరైనా మెయిల్స్ చేస్తున్నారా లేక టెర్రరిస్టులే మెయిల్ చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ మెయిల్స్ పంపింది ఉగ్రవాదులే అయితే.. ఎందుకు పోలీసులను అలర్ట్ చేస్తున్నట్లు..వాళ్ల లక్ష్యం వేరే ఏమైనా ఉందా..అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేస్తున్నారా అని ఇంటర్నల్‌గా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మే 7న ఆపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’.. ఐప్యాడ్ ప్రో 2024, ఐప్యాడ్ ఎయిర్.. ఇంకా ఏం ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు