Karan Johar : 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇంతలా అవమానిస్తారా? దుమారం రేపుతున్న కరణ్ జోహార్ పోస్ట్..
కరుణ్ జోహార్.. పరిచయం చేయాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- May 6, 2024 / 08:03 PM IST
Karan Johar Slams Comedian For Mimicking Him
కరుణ్ జోహార్.. పరిచయం చేయాల్సిన పని లేదు. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. రెండు న్నర దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కాఫీ విత్ కరణ్ జోహార్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల చివర్లో రానుంది. సినిమాల విషయం కాస్త పక్కన బెడితే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఓ కమెడియన్ ఆయన్ను అవమానించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మతో కలిసి కరణ్ టీవీ చూస్తున్న సమయంలో ఓ రియాలిటీ షోకు సంబంధించిన ప్రొమో వచ్చిందట. ఆ ప్రొమోలో కరుణ్‌ను ఓ కమెడియన్ చాలా దారుణంగా అనుకరించాడట. ఆ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
Raayan : రావణుడిగా ధనుష్..? రాయన్ రిలీజ్ ఎప్పుడంటే?
‘అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా.. ఓ పేరున్న ఛానెల్‌లో రియాలిటీ కామెడీ షోకు సంబంధించిన ఓ ప్రొమో వచ్చింది. ఇందులో ఓ కమెడియన్ నన్ను చాలా చీప్‌గా అనుకరించాడు. ఇలాంటివి సోషల్ మీడియాలో వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఇండస్ట్రీలో పేరున్న కమెడియన్ చేయడం బాధగా ఉంది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా నన్ను ఇలా అవమానించడం బాధగా ఉంది. ప్రొమో చూసిన తరువాత కోపం రాలేదు. కానీ.. ఎంతో బాధ కలిగింది. ‘అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కరణ్ రాసుకొచ్చాడు.
ఇంతకీ ఆ షో ఏమిటి? ఆ కమెడియన్ ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
Anupama Parameswaran : ‘లాక్ డౌన్’లో అనుపమ పరమేశ్వరన్.. ఫుల్ ఫామ్‌లో ఉందిగా అనుపమ..
