Super Hero Babu : ‘సూపర్ హీరో బాబు’.. అర్జున్ దాస్, శాండీ మాస్టర్ కలిసి చేయబోతున్న సినిమా..
అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. (Super Hero Babu)
Super Hero Babu
Super Hero Babu : తమిళ నటుడు అర్జున్ దాస్, నటుడు, డ్యాన్స్ మాస్టర్ శాండీ మాస్టర్ కలిసి నటిస్తున్న సినిమా సూపర్ హీరో. తెలుగులో ఈ సినిమా ‘సూపర్ హీరో బాబు’ అనే టైటిల్ తో రాబోతుంది. జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ సమర్పణలో రెడాక్టెడ్ స్టూడియోస్ బ్యానర్ పై శంజన్ జి నిర్మాణంలో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.
అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాలతో దగ్గరయి ఇటీవలే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో మెప్పించాడు. మరో వైపు డ్యాన్స్ మాస్టర్ శాండీ ఇప్పుడు నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. లోక చాప్టర్ 1, తెలుగులో కిష్కిందపురి సినిమాలతో తన నటనతో అదరగొట్టేసారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సూపర్ హీరో తరహా సినిమా చేయబోతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also Read : Oh Sukumari Trailer : ఐశ్వర్య రాజేష్ ‘ఓ.! సుకుమారి’ ట్రైలర్ రిలీజ్.. ముట్టుకుంటే షాక్..
శాండీ మాస్టర్, అర్జున్ దాస్ కాంబోలోని ఈ సినిమాల్లో సీన్స్ హైలెట్ గా ఉండనున్నాయట. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

