Akhil Nagarjuna : ఫస్ట్ హిట్.. ఏడ్చేసిన నాగార్జున, అఖిల్.. తండ్రి కాళ్ళ మీద పడ్డ అఖిల్..
లెనిన్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.(Akhil Nagarjuna)
Akhil Nagarjuna
Akhil Nagarjuna : అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పలు సినిమాలు చేసినా ఇప్పటివరకు నటుడిగా అభినందనలు తెచ్చుకోలేదు, కమర్షియల్ హిట్ కొట్టలేదు. హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. అఖిల్ నేడు లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కథ పాతదే అయినా కథనం, ఆసక్తికర ట్విస్ట్ లతో విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు.
లెనిన్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా అఖిల్ నటనని అందరూ అభినందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో అఖిల్ నటన అదుర్స్ అని అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. దీంతో లెనిన్ మూవీ యూనిట్ అన్నపూర్ణ స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అఖిల్ నటనపై ఫస్ట్ టైం అభినందనలు రావడం, హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగార్జున ఎమోషనల్ అయ్యారు.
Also Read : Vasudheva Sutham Review : ‘వసుదేవసుతం’ మూవీ రివ్యూ.. పూరి ఆలయం బ్యాక్ డ్రాప్లో డివోషనల్ టచ్ తో..
అఖిల్ కూడా తండ్రి నాగార్జున కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని హత్తుకొని ఏడ్చేశాడు. తండ్రీకొడుకులు ఆనందంతో ఎమోషనల్ అయినా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి అఖిల్ హిట్ కొట్టాడని సంబరాలు చేసుకుంటున్నారు.
