కథానాయిక మెహరీన్ ‘అశ్వథ్థామ’ గురించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రిలీజ్‌కి తక్కువ సమయం (జనవరి 31) ఉండడంతో ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది మూవీ టీమ్. తాజాగా కథానాయిక మెహరీన్ ‘అశ్వథ్థామ’ గురించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
Read Also : ఈ రేంజ్ వసూళ్లు వస్తాయని మెగాస్టార్ ముందే చెప్పారు – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
ఫుల్ గ్రిప్పింగ్‌గా ఉండే పర్ఫెక్ట్ థ్రిల్లర్!!
* ‘అశ్వథ్థామ’ అంటే చెడుకు వ్యతిరేకంగా నిలిచేవాడు. ఈ టైటిల్‌కి సినిమాలో 100% జస్టిఫికేషన్ ఉంటుంది. ట్రైలర్లో చూసిన మూమెంట్స్ సినిమాలో చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. హీరో సిస్టర్‌కి జరిగిన పెయిన్ఫుల్ ఇన్సిడెంట్‌తో హీరో జర్నీ బిగిన్ అవుతుంది. ‘అశ్వథ్థామ’ కంప్లీట్‌గా సీరియస్ సినిమా.. కామెడీ లేదు, కమెడియన్స్ కూడా ఉండరు. ఫుల్ గ్రిప్పింగ్‌గా ఉండే పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి నా క్యారెక్టర్ కోసం కాకుండా మంచి సినిమాలో పార్ట్ అవ్వడం కోసం చేస్తాను. ఈ సినిమా అలాంటిదే.
మనందరిలోనూ ‘అశ్వథ్థామ’ ఉంటాడు!!
* అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవ్వడం వల్ల సొల్యూషన్స్ వస్తాయని నేను అనుకోను. నా దృష్టిలో మనందరిలోనూ ‘అశ్వథ్థామ’ ఉంటాడు. తనని మనందరం బయటికి తీసుకురావాలి. సినిమాలో విలన్ రోల్ ఫిక్షనల్ కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా పట్టించుకోకుండా ఉండే వాళ్ళంతా నా దృష్టిలో విలన్సే.. సినిమాలనేవి కేవలం మాధ్యమం మాత్రమే. మార్పు అనేది మనలో రావాలి.
నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారుతుంది!!
* నాగశౌర్య ఫ్రెండ్ సర్కిల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఈ సినిమా నాగశౌర్యకి చాలా ఇంపార్టెంట్. తను ఈ సినిమాలో నటించాడు అంతవరకే. ఆ తరవాత స్టోరీ నేరేట్ చేయడం దగ్గరి నుండి డైరెక్షన్ అంతా రమణ తేజ గారే చూసుకున్నారు.. ఇందులో నాగశౌర్య ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ సినిమా నాకైనా, నాగశౌర్య కైనా కొత్తే. ఇలాంటి సినిమాలు ఇద్దరిలో ఎవరూ చేయలేదు. నాగశౌర్యకి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఈ సినిమాతో మారబోతుంది.
‘అశ్వథ్థామ’ కోసం ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నాను!!
* రీసెంట్గా తమిళంలో నేను నటించిన ‘పటాస్’, ఇక్కడ ‘ఎంత మంచివాడవురా’ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో కొన్ని స్రిప్ట్స్ వింటున్నాను. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ‘అశ్వథ్థామ’ రీలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్‌చేస్తున్నాను..