2 రోజులుగా కనపడకుండాపోయిన కాంగ్రెస్ నేత.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

Congress district chief: తనను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు.

తమిళనాడులో రెండు రోజులుగా కనపడకుండా పోయిన కాంగ్రెస్ నేత కేపీకే జయకుమార్ ధనసింగ్ (60) మృతదేహాన్ని పోలీసులు తిరునెల్వేలిలోని కరైచూతుపుదూర్ లో గుర్తించారు. ఆయన మృతదేహం సగం కాలిపోయి ఉందని పోలీసులు తెలిపారు.

తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా కేపీకే జయకుమార్ ధనసింగ్ పనిచేసేవారు. గురువారం రాత్రి నుంచి ఆయన కనపడడం లేదు. జయకుమార్ కుమారుడు కరుతయ్యా జఫ్రిన్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు జయకుమార్ కోసం వెతకడం ప్రారంభించారు.

ఇవాళ ఆయన మృతదేహం ఓ పొలంలో సగం కాలిన స్థితిలో కనపడిందని పోలీసులు చెప్పారు. ఇది హత్యా? బలవన్మరణమా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న జయకుమార్ తిరునెల్వేలి జిల్లా సూపరింటెండెంట్ కు ఓ లేఖ రాశారు. తనను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు.

ఆ లేఖలో కొందరి పేర్లను కూడా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నంగునేరి ఎమ్మెల్యే రూబీ ఆర్‌ మనోహరన్‌ పేరు కూడా అందులో ఉంది. తాను చనిపోతే వారిదే బాధ్యతని జయకుమార్ చెప్పారు. డబ్బు అప్పుగా తీసుకున్న విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.

Also Read: విజయవాడలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

ట్రెండింగ్ వార్తలు