Anil Ravipudi : ఐపీఎల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు..

ఇటీవల అనిల్ రావిపూడి ఐపీఎల్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు.

Anil Ravipudi : ప్రస్తుతం IPL సీజన్ నడుస్తుండటంతో ఏ సెలబ్రిటీ ఐపీఎల్ గురించి మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇటీవల హీరోయిన్స్ చాందిని చౌదరి, రాశీసింగ్ ఐపీఎల్ కి సంబంధించి వాళ్లకి తోచింది మాట్లాడి వివాదాల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం అనిల్ రావిపూడి కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్ లు చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. సినిమాలకు రండి సాయంత్రం పూట. కావాలంటే ఐపీఎల్ స్కోర్స్ ని ఆన్లైన్ లో చూసుకోవచ్చు అని అన్నారు.

దీంతో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. సినిమా చూడకపోతే కూడా కొంపలేమి మునిగిపోవు, ఓటీటీలోకి వచ్చాక అయినా చూసుకుంటాము, అయినా సినిమాకి డబ్బులు పెట్టి రావాలి, మ్యాచ్ ఫ్రీగా చూస్తాం ఫోన్లో.. అంటూ కామెంట్స్ చేస్తూ అనిల్ మాట్లాడిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.

Also Read : Salaar : ‘సలార్’ జపాన్ రిలీజ్ ట్రైలర్ చూశారా? జపాన్ లో సలార్ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా నేడు డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరగ్గా అనిల్ రావిపూడి వచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లేముందు ఓ డిస్ట్రిబ్యూటర్ ని కలిసాను. సమ్మర్ లో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్తే ఆ ఫ్లోలో మాట్లాడాను. ఐపీఎల్ చూడండి, సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తాను. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు అని అన్నారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఇంతటితో వదిలేస్తారా లేక దీనిపై కూడా ఏమైనా కామెంట్స్ చేసి అనిల్ రావిపూడిని మళ్ళీ వైరల్ చేస్తారా చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు