Saniya Iyyappan : మీద చెయ్యి వేసినందుకు అభిమానిని కొట్టిన హీరోయిన్..

సానియా, గ్రేస్‌ ఆంటోనిలు మాల్‌ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టారు. బాడీ గార్డ్స్ ఉన్నా వారితో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి పట్ల...........

Saniya Iyyappan :  ప్రముఖ మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్‌ మరో స్టార్ ఆర్టిస్ట్ గ్రేస్‌ ఆంటోనితో కలిసి సాటర్‌డే నైట్‌ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా వీరు కేరళలోని ఓ మాల్ లో అభిమానులతో ముచ్చటించారు. అక్కడికి అభిమానులు భారీ సంఖ్యలో తరకి వచ్చారు.

దీంతో సానియా, గ్రేస్‌ ఆంటోనిలు మాల్‌ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టారు. బాడీ గార్డ్స్ ఉన్నా వారితో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాదు ఏకంగా ఓ వ్యక్తి గ్రేస్‌ ఒంటిపై చేయి వేయడంతో సానియా అయ్యప్పన్‌ సీరియస్ అయి అతడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Salman Khan : 1000 కోట్లిస్తే ఖాళీగా ఇంట్లో కూర్చుంటా.. నాకు అసలు బిగ్‌బాస్‌‌కి హోస్ట్ చేయాలని లేదు..

అయితే ఈ సంఘటనపై గ్రేస్, సానియా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్లో నేను, నా కో స్టార్ గ్రేస్ బయటకి వస్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టారు. కొంతమంది హద్దుమీరి మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాడీ గార్డ్స్ ఉన్నా వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో నేనే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి ఎదురు కాకూడదు. మహిళల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి” అంటూ సానియా పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు