Pushpa 2 Song Update : ‘పుష్ప’ టైటిల్ సాంగ్ రేపే.. టక్కేసిన పుష్ప రాజ్ కొత్త లుక్ చూశారా?

అప్డేట్ తో పాటు ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Pushpa 2 Song Update : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి దేశమంతా ఎదురుచూస్తుంది. పుష్ప సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు సాంగ్స్, బన్నీ మేనరిజం వైరల్ అవ్వడం, అల్లు అర్జున్(Allu Arjun) కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచారు.

Also Read : Sabari Movie Song : ‘శబరి’ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ మోటివేషనల్ సాంగ్ విన్నారా?

ఇటీవల పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ ప్రోమో అని పుష్ప పుష్ప.. అంటూ సాగే ఓ చిన్న వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ఫుల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 మొదటి సాంగ్ రేపు మే 1న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్ తో పాటు ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బన్నీ స్టైలిష్ గా టక్ వేసి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. దీంతో పోస్టర్ వైరల్ గా మారింది. ఈ లుక్ లో అల్లు అర్జున్ అదరగొట్టేసాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇక పుష్ప 2 టైటిల్ సాంగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు