Sabari Movie Song : ‘శబరి’ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ మోటివేషనల్ సాంగ్ విన్నారా?
తాజాగా శబరి సినిమా నుంచి ఓ మోటివేషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
- Saketh U
- Updated on- April 30, 2024 / 02:47 PM IST
Varalaxmi Sarathkumar Sabari Movie Motivational Song Released by Director Karuna Kumar
Sabari Movie Song : వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘శబరి’. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తల్లీకూతుళ్ల కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా శబరి ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, టీజర్, పలు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. శబరి సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా శబరి సినిమా నుంచి ఓ మోటివేషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘అలిసిన ఊపిరి కణకణ మండే ఆయుధమల్లే మారే…’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు కరుణ కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటని రహమాన్ రాయగా గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాట వింటుంటే వరలక్ష్మి తన పగని తీర్చుకోడానికి సిద్ధమవుతున్నట్టు, ఏదో సాధించాలి అనే తపనతో ఉండే సన్నివేశంలో ఈ పాట రానున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ మోటివేషనల్ సాంగ్ వినేయండి.
ఇక శబరి సినిమా నుంచి ఈ మోటివేషనల్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ… పాట చాలా బాగుంది. విజువలైజేషన్ కూడా బాగా తీశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ కథ తీసుకుని థ్రిల్లర్ చేయడం కచ్చితంగా సక్సెస్ అవుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి వర్సటైల్ యాక్టర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వస్తున్నారంటే కచ్చితంగా ఆసినిమా ఆసక్తిగా ఉంటుంది, తప్పకుండా చూడాలి ఈ సినిమాని అని తెలిపారు.
