Gujarat Police arrested two people Amit Shah edited video case
Amit Shah edited video case: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇద్దరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని పీఏ సతీష్ వాన్సోలాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఆర్బీ బరియాను అరెస్ట్ చేసినట్టు అహ్మదాబాద్ జోన్ వన్ డీసీపీ లవీనా సిన్హా మంగళవారం వెల్లడించారు. నిందితులిద్దరూ తమ ఫేస్‌బుక్ ఖాతాల్లో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినట్టు తెలిపారు.
”ఎడిట్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో 2 ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల నుంచి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు గుర్తించాం. సెక్షన్లు 505A, 1B, 469, 153A.. IT చట్టం కింద FIR నమోదు చేయడం జరిగింది. ఒక ఫేస్‌బుక్ ప్రొఫైల్ సతీష్ వాన్సోలా పేరిట, మరో ప్రొఫైల్ ఆర్బీ బరియా పేరిట ఉంది. నిందితులిద్దరినీ నిన్న అరెస్ట్ చేశాం. వీరికి రాజకీయ పార్టీలతో సంబంధాలున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ జరుగుతోంద”ని డీసీపీ లవీనా సిన్హా మీడియాతో చెప్పారు.
కాగా, అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్, కోఆర్డినేటర్ నవీన్, స్పోక్స్ పర్సన్ ఆస్మా తస్లీం, పీసీసీ సెక్రటరీ శివకుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. మే 1న ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు