Cm Jagan Sensational Comments On Tdp Manifesto
Tdp Janasena Manifesto : టీడీపీ జనసేన బీజేపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. అన్నమయ్య జిల్లా కలికిరి సభలో కూటమి మ్యానిఫెస్టోపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. కూటమి మ్యానిఫెస్టోపై మోదీ ఫోటో ఎందుకు లేదో తెలుసా? అని జగన్ ప్రశ్నించారు.
”కూటమి మ్యానిఫెస్టోలో ముగ్గురి ఫొటోలు పెట్టుకునే పరిస్థితి లేదు. కూటమి మ్యానిఫెస్టోలో మోదీ ఫొటో పెట్టొద్దని బీజేపీ చెప్పింది. మోదీ ఫొటో పెడితే ఒప్పుకోబోమని ఫోన్ చేసి మరీ చెప్పారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని మోదీ ఫొటో పెట్టొద్దన్నారు. చంద్రబాబు ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో ప్రజలు గమనించాలి.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? మళ్లీ ఆ ముగ్గురు కలిసి అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ కొత్త హామీలిచ్చారు. లంచాలు, వివక్షకు తావులేని పాలన కావాలంటే వైసీపీకి ఓటేయాలి” అని సీఎం జగన్ అన్నారు.
”పెద్దమనిషి చంద్రబాబు మ్యానిఫెస్టో అంటూ డిక్లేర్ చేశారు. ఏమైందో తెలుసా? పైనుంచి బీజేపీ ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా? అయ్యా.. నీ ఫొటోనే పెట్టుకో. మోదీ ఫోటో మాత్రం మీ మ్యానిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోకు. మేము ఒప్పుకోము అని అంటున్నారు. అంతే, ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమేనని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది. ముగ్గురు కూటమిలో ఉంటే.. ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడు అని అంటే.. ఒకసారి గమనించండి.. ఆయన ప్రజలు ఏ స్థాయిలో మోసం చేయడానికి బరితెగించారో గ్రహించండి. మీ అందరితో ఒక్కటే చెబుతున్నా. మళ్లీ వాలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదల భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పనులు, చదువులు, పిల్లలు బాగుపడాలన్నా.. వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడాలన్నా.. ప్రతీ ఒక్కరు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి” అని సీఎం జగన్ అన్నారు.
Also Read : ఏపీలో కూటమికి గ్లాస్ గండం..! గాజు గ్లాసుతో లాస్ తప్పదా?