Mega Family – Sagar : మెగా ఫ్యామిలీతో.. మొగలిరేకులు RK నాయుడుకు అంత మంచి అనుబంధం ఎలా ఏర్పడింది..?

సాగర్ కి మెగా ఫ్యామిలీతో ఈ అనుబంధం ఎలా ఏర్పడింది అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Mega Family – Sagar : మొగలిరేకులు సీరియల్ లో RK నాయుడు పాత్రతో బాగా పాపులర్ అయ్యారు నటుడు సాగర్. మొగలిరేకులు సీరియల్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ RK నాయుడు 2008 నుంచి 2013 వరకు అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించాడు. ప్రస్తుతం సాగర్ సీరియల్స్ ఆపేసి సినిమాలు చేస్తున్నాడు. అయితే సాగర్ కి మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.

సాగర్ నటించిన 100 సినిమా టీజర్ ని చిరంజీవి తల్లి అంజనాదేవి లాంచ్ చేశారు. గతంలో కూడా పలుమార్లు సాగర్ అంజనా దేవిని కలిశారు. అలాగే పలుమార్లు నాగబాబు స్టేజిపై సాగర్ ని పొగిడారు. సాగర్ జనసేన పార్టీలో కూడా చేరారు. ఇలా సాగర్ కి – మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి చుట్టాలు, స్నేహితులు లేని సాగర్ కి మెగా ఫ్యామిలీతో ఈ అనుబంధం ఎలా ఏర్పడింది అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Sagar : అందుకే సీరియల్స్ మానేశాను.. మొగలిరేకులు RK నాయుడు..

సాగర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నా మొగలిరేకులు సీరియల్ చిరంజీవి ఇంట్లో కూడా చూసేవారు. చిరంజీవి తల్లి అంజనా దేవి గారు మొగలిరేకులు సీరియల్ రోజూ మిస్ అవ్వకుండా చూసేవారంట. అంజనా దేవి గారికి నా పాత్ర బాగా నచ్చింది. అలాగే అంజనాదేవి గారి నాన్నని అందరూ RK నాయుడు అని పిలిచేవారంట. అలా కూడా ఆవిడ నాకు కనెక్ట్ అయ్యారు. నటుడిగా నన్ను అభినందించడానికి నన్ను కలవాలని అడిగారట. నాగబాబు గారు ఓ సారి ఫోన్ చేసి మా అమ్మకు నీ పాత్ర బాగా నచ్చింది, ఒకసారి కలవాలని అనుకుంటుంది నిన్ను అని చెప్పారు. దాంతో ఆశ్చర్యపోయాను. అలా ఫస్ట్ టైం అంజనమ్మ గారిని కలిసాను. అప్పట్నుంచి అంజనా దేవి గారితో మంచి అనుబంధం ఏర్పడింది. నేను అప్పుడప్పుడు అంజనమ్మ గారికి ఫోన్ చేస్తాను, ఆమె కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, కలుస్తాము. అలా మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది. నాగబాబు గారు కూడా ఓ ఈవెంట్లో నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ స్టేజిపై నన్ను అభినందించారు. చిరంజీవి గారు కూడా ప్రశంసించారు. నేను చిరంజీవి అభిమానిని. అలాంటిది ఇవాళ చిరంజీవి గారి తల్లితో, మెగా ఫ్యామిలీతో మంచి అబుబంధం ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు