ట్రైన్ యాక్సిడెంట్లలో తప్పు టెక్నాలజీదా.. కవచ్ వర్కౌట్ కావట్లేదా.. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఫెయిల్యూరా.?

కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు.

how Kavach train protection system works explained here

Kavach train protection system: ప్రమాదం అంటేనే అనుకోకుండా జరుగుతుంది. కొన్నిసార్లు నిర్లక్ష్యం, మానవ తప్పిదం, వాడుతోన్న టెక్నాలజీలో లోపంతో కూడా యాక్సిడెంట్లు కావొచ్చు. అయితే రైల్వే ప్రమాదాలకు మాత్రం అంతుచిక్కడం లేదు. గత పదేళ్లలో జరిగిన ఏ ఒక్క ట్రైన్ యాక్సిడెంట్‌కు పక్కా ఇది కారణమని చెప్పలేకపోతోంది రైల్వేశాఖ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి సాయం చేయడం, విచారణలు అంటూ కమిటీలు వేయడంతో సరిపెడుతోంది. లాంగ్ టర్మ్‌లో ట్రైన్ యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.

డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అధిక స్పీడు
రైలు ప్రమాదాలకు 70 శాతం కారణం పట్టాలు తప్పడమే అని పలు రిపోర్టులు చెప్తున్నాయి. అసలు బోగీలు పట్టాలు తప్పడానికి కారణమేంటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ట్రాకుల్లో పగుళ్లు, రిపేర్లు చేయని ట్రాకుల కారణంగా కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ట్రాకుల నిర్వహణ సరిగా లేక, రిపేర్ల సమస్యతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైలు పట్టాలు తప్పడానికి మరో ప్రధాన కారణం డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అధిక స్పీడుతో వెళ్లడం. అందుకే 110 నుంచి 130 కి.మీ. వేగంతో రైళ్ల రాకపోకలు సాగే ట్రాకులను ప్రతీ మూడు నెలలకోసారి అప్‌గ్రేడ్ చేయాలని.. ట్రాక్ రికార్డింగ్ కూడా చేయాలని సిఫార్సులు ఉన్నాయి.

రైలు ప్రమాదాల నివారణకు.. కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌ పైకి రాకుండా చూసి పట్టాలను కేటాయించే వ్యవస్థనే ఈ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్. ట్రాక్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక రైలు వెళ్లొచ్చనే వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆపుతుంది. ఒకవేళ ఏదైనా అడ్డుగా ఉంటే సిగ్నల్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇక కవచ్.. ఆటోమేటెడ్ రైలు సేఫ్టీ సిస్టమ్. ఇది రైలు స్పీడ్‌ను అబ్జర్వ్ చేస్తుంది. యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటే రైలు ఆపరేటర్లను అలర్ట్ చేస్తుంది. డ్రైవర్ వెంటనే స్పందించకుంటే రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసేలా కవచ్ పనిచేస్తుంది. వెనుక నుంచి ఢీకొనకుండా ఆపే సామర్థ్యం దీని సొంతం. కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు.

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్ ఇంజిన్‌లో బ్లాక్ బాక్స్‌ను అమర్చాలని భావిస్తోంది. విమానంలో వాడే బ్లాక్ బాక్స్ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఫిక్స్ చేస్తామని.. ఇది ప్రమాదం జరగకుండానే చేస్తుందని.. ఒకవేళ యాక్సిడెంట్‌ అయితే బ్లాక్ బాక్స్‌లో.. లోకో పైలట్ల మాటలు, రైలు యాక్టివిటీ వీడియో, ఆడియో రికార్డ్ అవుతుందని చెబుతున్నారు అధికారులు. ఇక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్‌ కదలికలను ఫోకస్ చేస్తే.. మరొకటి ఇంజిన్ బయట ట్రాక్కు ఎదురుగా ఉండి, ట్రాక్ను ఫోకస్ చేస్తుంది. నాలుగో కెమెరాను ఇంజిన్ పైభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: మానవ తప్పిదమా.. టెక్నాలజీలో లోపమా.. వరుస రైల్వే ప్రమాదాలకు కారణమేంటి..?

కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. కొంత వరకు సక్సెట్ రేటు ఉన్నా.. ప్రమాదాలను కంట్రోల్ అవడం కష్టంగానే ఉంది. అందుకే త్వరలోనే బ్లాక్ బాక్స్ ప్రయోగానికి రెడీ అయింది రైల్వేశాఖ. దాంతో పాటు సిగ్నల్ సిస్టమ్‌ను ఇంకా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. మానవ తప్పిదాలను కూడా సరిచేసే అన్ని విభాగాలు అలర్ట్‌గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయింది రైల్వే డిపార్ట్‌మెంట్. అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా నేపథ్యంలో ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా పకడ్బందీ చర్యలకు రెడీ అయింది రైల్వేశాఖ.

ట్రెండింగ్ వార్తలు