Niharika Konidela Says Interesting Thing about her Birth Day while Chiranjeevi Song Shoot
Niharika – Chiranjeevi : నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తుంది. నిహారిక నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. దీంతో నిహారిక, మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ టీవీ షోలో నిహారిక పాల్గొనగా అక్కడ ముగ్గురు మొనగాళ్లు సినిమా ప్రస్తావన రావడంతో ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
నిహారిక మాట్లాడుతూ.. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చామంతి పువ్వా పువ్వా.. సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు నేను పుట్టాను. ఆ సినిమాకి మా నాన్నే నిర్మాత. ఓ పక్క సాంగ్ షూటింగ్ జరుగుతుంటే నేను పుట్టానని తెలిసి మధ్యలో వచ్చి సంతకం పెట్టి, నన్ను చూసి మళ్ళీ షూట్ కి వెళ్లిపోయారు అని తెలిపింది. దీంతో నిహారిక కామెంట్స్ మెగా సర్కిల్ లో వైరల్ అవుతున్నాయి.
నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా ముగ్గురు మొనగాళ్లు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి ట్రిపుల్ రోల్ చేసి మెప్పించి మంచి విజయం సాధించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1994లో రిలీజయింది. నిహారిక 1993 డిసెంబర్ లో పుట్టింది.