Devara – Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ కోసం ఎంత ఫుడ్ తెప్పించారో చూడండి.. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా?

దేవర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది.

Devara – Janhvi Kapoor : దేవర షూటింగ్.. జాన్వీ కోసం ఎంత ఫుడ్ తెప్పించారో చూడండి.. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా?

Janhvi Kapoor post a Photo from Devara Shoot Lunch Break with huge Food Items

Updated On : July 31, 2024 / 12:03 PM IST

Devara – Janhvi Kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ఫుల్ మాస్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న సినిమా దేవర. ఇప్పటికే ఈ సినిమా నుంచి మాస్ గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. రెండో సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. దేవర సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది.

అయితే దేవర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ జరుగుతుండగా జాన్వీ కపూర్ ఈ షూటింగ్ లో పాల్గొంది. అయితే లంచ్ బ్రేక్ లో జాన్వీ కోసం స్పెషల్ గా చాలా రకాల ఐటమ్స్ ఫుడ్ తెప్పించారు. ఆ ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టగా జాన్వీ ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. దేవర షూటింగ్ అంటే నాకు ఇష్టం అని తెలిపింది.

Also Read : The Journey of Viswam : గోపీచంద్ ‘విశ్వం’ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ కామెడీ రిపీట్..?

దీంతో జాన్వీ ఫుడ్ పోస్ట్ వైరల్ గా మారగా జాన్వీ కోసం మూవీ యూనిట్ ఇన్ని వెరైటీస్ తెప్పించారా? లేక ఎన్టీఆర్ తెప్పించాడా అని చర్చించుకుంటున్నారు. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి అందరికి తెలిసిందే. మూవీ టీమ్ లో అందరికి ప్రభాస్ తన ఇంటి నుంచి భారీగా ఫుడ్ తెప్పించి పెడతాడు. చాలా మంది హీరోయిన్స్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి పొగుడుతూ పోస్టులు కూడా చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రభాస్ లాగే ఫాలో అవుతున్నాడా అని చర్చించుకుంటున్నారు.

Janhvi Kapoor post a Photo from Devara Shoot Lunch Break with huge Food Items