Pawan Kalyan : మా నాన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. అందుకే నాకు ఆ పేరు.. ఫస్ట్ సినిమా నవ్విస్తుంది..
ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పురుష:. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పురుష: సినిమా మే 22న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
తన గురించి చెప్తూ.. మాది కారంపూడి. సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను హీరో అవ్వాలనేది మా నాన్నకల. మా నాన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ‘తమ్ముడు’ సినిమా టైంలో పుట్టడంతో నాకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు. కాలేజీకి వచ్చాక నాకు కూడా సినిమాలు ఇంటరెస్ట్ వచ్చింది. వైజాగ్‌లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను అని తెలిపారు.
Also Read : Sonal Chauhan : సోనాల్ చౌహన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. కేక్ కటింగ్ ఫొటోలు..
మొదటి సినిమా హీరోగా పురుష: గురించి చెప్తూ.. డీఓపీ సతీష్ గారి వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని నా మొదటి సినిమా ఇలాంటి ఓ ఫ్యామిలీ కామెడీ కథతో వస్తున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి సినిమాగా అనిపిస్తుంది. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో మొదటి సినిమాలోనే పనిచేసాను. నన్ను ఒక తమ్ముడిలా అందరూ సపోర్ట్ చేసారు. మొదటిసారి సినిమా పరిశ్రమ లోపల హార్డ్ వర్క్, కష్టాలు చూశాను. నేను చాలా ఇంట్రోవర్ట్. ఈ విషయంలో డైరెక్టర్ బాగా సపోర్ట్ చేసి నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఈ సినిమా నవ్విస్తుంది. పెళ్లిలో కష్టాలను చూపిస్తుంది అని తెలిపారు.
అలాగే.. నా ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తుంటారు. కానీ ఏ జానర్లో సినిమా చేసినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. మా అక్క నాకు బాగా సపోర్ట్ చేసింది. మా నాన్న నిర్మాత అయిన ఇంట్లో వరకే నాన్న. సెట్ లో వస్తే నిర్మాత – హీరోలాగే ఉండేవాళ్ళం. ఇప్పటివరకు ఈ సినిమా చుసిన వాళ్ళు మొదటి సినిమా అయిన చాలా బాగా చేసానని మెచ్చుకున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఇది రిలీజ్ అయ్యాకే నెక్స్ట్ సినిమాల గురించి ఆలోచిస్తాను అని తెలిపారు.
Also Read : Manchu Manoj : ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్.. సమాజం కోసం..
