IPL 2026: IPL 2026: భళా బెంగళూరు.. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై.. పంజాబ్ వరుసగా 6వ ఓటమి
IPL 2026: పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపంర కంటిన్యూ అవుతోంది. మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో డీలా పడింది. తాజాగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో మ్యాచ్ లో పంజాబ్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. 223 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్.. 199 పరుగులకే పరిమితమైంది. దీంతో 23 రన్స్ తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. అంతేకాదు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన తొలి జట్టు ఆర్సీబీనే.
బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. రసిక్ సలామ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. హేజిల్ వుడ్, శర్మ, షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.
