Gold Silver Price Today : కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే వారం రోజుల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Silver Price Today : బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులోకి రాబోతున్నాయా..? మోదీ పిలుపుతో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఒక సంవత్సరం పాటు బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే వరుసగా గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు, పెరిగిన ట్రెజరీ యీల్డ్ల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురయ్యాయి. దీంతో గోల్డ్ రేటు అమాంతం తగ్గుతుంది.

శుక్ర, శనివారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. తులం బంగారంపై రెండు రోజుల్లో సుమారు రూ.1500 తగ్గింది. అయితే, ఇవాళ (ఆదివారం) బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 30 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,715 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరసైతం భారీగా తగ్గుతోంది. గత మూడురోజుల్లో కిలో వెండిపై రూ.30వేలు తగ్గింది. అయితే, ఇవాళ (ఆదివారం) వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,930 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,850 వద్దకు కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,57,080కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,43,850 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
