The Journey of Viswam : గోపీచంద్ ‘విశ్వం’ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ కామెడీ రిపీట్..?
తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.
![The Journey of Viswam : గోపీచంద్ ‘విశ్వం’ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ కామెడీ రిపీట్..? The Journey of Viswam : గోపీచంద్ ‘విశ్వం’ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ కామెడీ రిపీట్..?](https://10tv.in/wp-content/uploads/2024/07/viswam-1.jpg)
The Journey of Viswam a Making Video Released from Gopichand Sreenu Vaitla Movie
The Journey of Viswam : శ్రీను వైట్ల, గోపీచంద్ కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా విశ్వం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.
తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమా చాలా భాగం ఇటలీలోనే షూట్ చేసినట్టు తెలుస్తుంది. హై యాక్షన్ సీక్వెన్స్ లతో కమర్షియల్ సినిమాలా ఉండబోతుంది విశ్వం. అలాగే ఇండియాలో కూడా కొంతభాగం షూట్ చేసారు. శ్రీను వైట్లకి అచ్చొచ్చిన ట్రైన్ కామెడీని ఈ సినిమాలో పెట్టినట్టు మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది.
Also Read : Kiara Advani : కియారా అద్వానీ బర్త్ డే.. సరికొత్త పోస్టర్‌తో ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ విషెస్..
శ్రీనువైట్ల వెంకీ సినిమాలో రవితేజ – బ్రహ్మానందం, AVS.. పలువురు నటీనటులతో చేసిన కామెడీ ఇప్పటికి నవ్విస్తూనే ఉంటుంది. ఆ కామెడీ సీక్వెన్స్ లో బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో ట్రైన్ కామెడీ విశ్వం సినిమాలో చూపించబోతున్నారట శ్రీను వైట్ల. గోపీచంద్ – హీరోయిన్ – పలువురు కమెడియన్స్ తో ఈ ట్రైన్ కామెడీని షూట్ చేసారు. మరి ఈ సినిమా ట్రైన్ కామెడీ కూడా వెంకీ లాగా మెప్పిస్తుందా చూడాలి. త్వరలోనే ఈ సినిమా రానుంది. మీరు కూడా ఈ మేకింగ్ వీడియో చూసేయండి.