Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మొట్టమొదటి సారిగా ఇస్కాన్ నెల్లూరి ఆధ్వర్యంలో అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆగస్టు 1నుంచి 20 తేదీ వరకు ఈ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఏ వయస్సు వారైనా ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.

Sri Krishna Janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మొట్టమొదటి సారిగా అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ నెల్లూర్ ప్రెసిడెంట్ హెచ్.హెచ్. సుక్‌దేవ్ గోస్వామి తెలిపారు. ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు అంతర్జాతీయ స్థాయిలో ఈ కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తుండటం జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ కల్చరల్ ఫెస్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఏ వయసు వారైనా 300+ సబ్ కేటగిరీలతో 50+ ఈవెంట్‌లలో ఉచితంగా పాల్గొనవచ్చు. ఇందుకోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేవు. కల్చర్ ఫెస్ట్ పాల్గొనే వారికి సర్టిఫికేట్‌లు అందించడంతో పాటు విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ కల్చరల్ ఫెస్ట్ ప్రధాన లక్ష్యం.. మనకు దేవుడు బహుమతిగా ఇచ్చిన ప్రతిభను అతని ఆనందానికి నిమగ్నం చేయడమేనని సుక్ దేవ్ గోస్వామి తెలిపారు.

ఇంతపెద్ద భారీ కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహించడం ప్రపంచంలోనే మొదటిసారని గోస్వామి తెలిపారు. 20రోజుల్లో నిరంతరం ఇన్ని ఈవెంట్లను అందిస్తున్నామని, ఎక్కడి నుండైనా ఏ వయస్సు వారైనా అనుకూలమైన సమయంలో ఏదైనా కార్యకలాపాన్ని చేయవచ్చునని, మూల్యాంకనం కోసం అప్‌లోడ్ చేయవచ్చునని తెలిపారు. ప్రపంచంలోని వివిధ అనుకూలమైన సమయాల్లో ఫైనల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతాయని అన్నారు. ఈ ఫెస్ట్ లో ఏడు ఖండాల నుండి దాదాపు 80దేశాల నుండి పాల్గొంటారని మేము ఆశిస్తున్నామని అన్నారు. మరిన్ని వివరాల కోసం చిన్మయ కృష్ణ దాసు +91 8919717982 లేదా +91 97018 39381 లేదా cmkdasa@gmail.comని సంప్రదించవచ్చని ఇస్కాన్ నెల్లూర్ ప్రెసిడెంట్ హెచ్.హెచ్. సుక్‌దేవ్ గోస్వామి తెలిపారు

 

ఉచిత రిజిస్ట్రేషన్లు కోసం వెబ్‌సైట్ లింక్ : https://iskconlms.dhanushinfotech.com/

మెయిల్ ఐడి : cmkdasa@gmail.com

విచారణ కోసం వాట్సాప్ సంఖ్య : +91 8977637108 లేదా +91 8919717982 (చిన్మయ కృష్ణ దాసు)

ప్రోగ్రామ్ వ్యవధి : ఆగస్టు 1 – 20 , 2022

రిజిస్ట్రేషన్లు :

ప్రారంభ తేదీ: జూలై 9
చివరి తేదీ: ఆగస్టు 20

ఫలితాలు : ఆగస్టు 25 – 31

ట్రెండింగ్ వార్తలు