YS Jagan: ముక్కుసూటిగా అడుగుతున్నా.. ఎవరి రిపోర్ట్ ఏంటో చూద్దామా చంద్రబాబు?: జగన్

రైతు రుణమాఫీ చేశారా? బ్యాంకుల్లో ఉన్న బంగారు విడిపించారా అని జగన్ ప్రశ్నించారు.

మహిళల సాధికారతను జగన్ పట్టించుకున్నారా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నాయకుడంటే మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఉండాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే ఉందని చెప్పారు. ఎవరి రిపోర్ట్ ఏంటో చూద్దామా అని జగన్ నిలదీశారు.

రైతుల విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో? జగన్ రిపోర్ట్ ఏమిటో? చంద్రబాబును ముక్కుసూటిగా అడుగుతున్నానని చెప్పారు. రైతు రుణమాఫీ చేశారా, బ్యాంకుల్లో ఉన్న బంగారు విడిపించారా అని జగన్ ప్రశ్నించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ, వడ్డీ రాయితీలు, రైతు పెట్టుబడికి బరోసా డబ్బులు ఏనాడైనా ఇచ్చారా అని నిలదీశారు.

టంగుటూరు ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు అమలు చేసిన పథకాలు చెప్పుకోవడానికి ఏమీ లేవని అన్నారు. ఎన్నికల్లో వేసే ఓటు పేద జీవితాల తలరాతను మార్చుతాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ చంద్రముఖి అవతారమెత్తుతారని అన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల ముందు బాబు అన్నారని, కాని జాబులు వచ్చాయా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 32 వేలు అని చెప్పారు. అదే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగులు 2లక్షల 42 వేలు అని తెలిపారు. చంద్రబాబు చేసిన అబివృద్ధి ఏదీ లేదని అన్నారు.

Also Read: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

ట్రెండింగ్ వార్తలు