పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

Updated On : April 30, 2024 / 11:30 AM IST

Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తన పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ అర్థంపద్దం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతానన్నారు. రంగువేసుకుని వస్తే ఓట్లు వేయరని, తొందరలో పవన్ పార్టీ ప్యాకప్ చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తోటి వారిని గౌరవిడంచడం రాదని, పవన్ కల్యాణ్‌కు డబ్బే ప్రాణమన్నారు. సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో కాదని హితవు పలికారు. రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చందాల్లో ఎంత వినియోగించారో సమాధానం చెప్పాలన్నారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే రాజకీయ ఆదాయమే బాగుందన్నారు.

రాష్ట్రం చంద్రబాబు తాత జాగీర్ కాదని వ్యాఖ్యానించారు. 1978లో చంద్రబాబుకి ఇంటి పెంకులు మార్చుకోవడానికి కూడా స్థోమత లేదని, రెండు ఎకరాలు నుంచి అపర కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు.

Also Read: పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి?