కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూత.. మోదీ సంతాపం

V Srinivas Prasad: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వీ శ్రీనివాస్ మార్చి 17నే ప్రకటించారు.

కర్ణాటకలోని చామరాజనగర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వీ శ్రీనివాస్ ప్రసాద్ (76) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వీ శ్రీనివాస్ మార్చి 17నే ప్రకటించారు.

అనంతరం కూడా ఆయన ఇంటికి రాజకీయ నాయకుల తాకిడి తగ్గలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పాటు ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులు వీ శ్రీనివాస్ మద్దతు కోసం ఆయన ఇంటిని సందర్శించారు. మైసూర్-కొడగు, చామరాజనగర్ సెగ్మెంట్ అభ్యర్థులు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, ఎం లక్ష్మణ, ఎస్ బాలరాజ్, సునీల్ బోస్, తదితరులు కూడా శ్రీనివాస్ ను కలిశారు.

శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్‌సభకు, మైసూరు జిల్లా నంజనగూడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వీ శ్రీనివాస్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత తనకు చాలా బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రీనివాస ప్రసాద్ పేద, అణగారిన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సానుభూతి తెలిపారు.

Also Read: ఈ 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం

ట్రెండింగ్ వార్తలు