పావురాల రెట్టలు మనుషులను చంపుతాయి.. కుమార్తె మరణంతో పుణె మాజీ కార్పొరేటర్ కీలక నిర్ణయం..

పూణే మాజీ కార్పొరేటర్ షామ్ మాన్కర్ పావురాల వల్ల మనుషులకు వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పావురాల రెట్టలు మనుషులను చంపుతాయి.. కుమార్తె మరణంతో పుణె మాజీ కార్పొరేటర్ కీలక నిర్ణయం..

former Pune corporator Sham Mankar

Updated On : August 14, 2025 / 2:07 PM IST

Former Pune corporator Sham Mankar : పూణే మాజీ కార్పొరేటర్ షామ్ మాన్కర్ పావురాల వల్ల మనుషులకు వచ్చే ఇబ్బందులు, అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పావురాలు విసర్జన చేసిన వ్యర్థాలు రెండు మూడు రోజుల్లో ఎండిపోయి వాటి కణాలు గాలిలో వ్యాపిస్తాయి.. గాలిలోని ఈ కణాలు కొంతమందికి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే వారు త్వరగా ఆనారోగ్యం పాలవుతారని.. షామ్ మాన్కర్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఆమె ఇలా చేయడం వెనుక ఓ విషాధ ఘటన ఉంది..

Also Read: ‘మాకు వివాదం వద్దు, పరిష్కారం కావాలి…’ వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

షామ్ మాన్కర్ కు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శీతల్ షిండే జనవరి 19న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. నిజానికి.. ఆమె కోలుకొని ఇంటి వస్తుందని కుటుంబం భావించింది. కానీ, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పావురం రెట్టల కారణంగా ఆమెకు పల్మనరీ ఫైబ్రోసిస్ సోకింది. దీంతో మరెవరూ తన కుమార్తెలా ఇబ్బంది పడొద్దని భావించిన షామ్ మాన్కర్ పావురాల వల్ల వచ్చే ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.

షామ్ మాన్కర్ మాట్లాడుతూ.. నా కుమార్తె 2017లో అనారోగ్యం పాలైంది. ఆమె నిరంతరం దగ్గుతో బాధపడుతుండేది. మేము అనేకసార్లు స్థానిక వైద్యులకు చూపించాం. ఆయుర్వేద వైద్యులకు చూపించాం. కానీ, నా కుమార్తె దగ్గు మాత్రం ఆగలేదు. సమస్య పరిష్కారం కోసం ఓ వైద్యుడిని కలిశాం.. మా పాపను పరీక్షించిన వైద్యుడు.. శీతల్ నివసించే చోట పావురాల గుంపులు ఉంటాయా అని ప్రశ్నించాడు. అవును.. ప్రజలు పావురాలకు ఆహారం పెట్టేవారని చెప్పాం. పావురాల వల్లే శీతల్ కు దగ్గు వస్తుందని చెప్పారు. ఆ తరువాత శీతల్‌ను ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాం.

పూణే తర్వాత, ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో కూడా శీతల్ చికిత్స తీసుకుంది. ప్రతిచోటా అన్ని పరీక్షలు జరిగాయి. కానీ, ఆమె సమస్య పెద్దదవుతూనే వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత శీతల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమెకు నడవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది. ఆమెకు రాత్రి నిద్రకూడా పట్టకపోయేది. మరికొన్ని రోజుల తరువాత ఆమెకు కృత్రిమ ఆక్సిజన్ అవసరం రావడం ప్రారంభమైంది. ఆమె బయటకు వెళ్లినప్పుడు కూడా తన వద్ద ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్‌ను ఉంచుకునేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్‌తో మాట్లాడుతూ షామ్ మాన్కర్ చెప్పారు.

పూణేలోని డివై పాటిల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఊపిరితిత్తుల దానానికి శీతల్ పేరును చేర్చాం. మాకు రెండు సార్లు ఊపిరితిత్తులు వచ్చాయి. కానీ, మొదటిసారి అవి సరిపోలలేదు. రెండోసారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. జనవరి 19న శీతల్ వెన్నునొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరింది. శీతల్ తనకు ఆరోగ్య మెరుగు పడ్డాక ఇంటికి వస్తానని నాతో చెప్పింది. కానీ, ఆమె చికిత్స పొందుతూనే మరణించింది అంటూ షామ్ మాన్కర్ కన్నీటి పర్యాంతమైంది. నా కుమార్తెకు వచ్చిన ఇబ్బంది మరొకరికి రావొద్దనే ఉద్దేశంతో పావురాల వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.