‘మాకు వివాదం వద్దు, పరిష్కారం కావాలి…’ వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (supreme court) లో ఇవాళ విచారణ జరిగింది.

‘మాకు వివాదం వద్దు, పరిష్కారం కావాలి…’ వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

supreme court

Updated On : August 14, 2025 / 1:19 PM IST

supreme court: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. స్థానిక అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ సమస్యకు కారణమని, జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం ఈ పరిస్థితికి దారితీసిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇటీవలి తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వు చేసింది.

Also Read: అయ్యో.. చైనా యువతకు ఎంత కష్టమొచ్చింది..! డబ్బులు చెల్లించి ఆఫీసుల్లో పనిచేస్తున్న నిరుద్యోగులు.. ఎందుకంటే..?

ఆగస్టు 11న సుప్రీంకోర్టు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఢిల్లీ- ఎన్సీఆర్‌లోని అధికారులు అన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలను త్వరగా డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే, సుప్రీం తీర్పుపై రాజకీయ, సినీ అనేక వర్గాల ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికితోడు తీర్పుపై స్టే విధించాలని పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో గురువారం త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారించింది.

ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలనే సుప్రీంతీర్పును సమర్థించారు. అయితే, మాంసాహారం తినేవారు కూడా జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఎంతో మంది చిన్నారులు వీధి కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. స్టెరిలైజేషన్‌ వల్ల రేబిస్‌ను అరికట్టలేము. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ.. ఆగస్టు 11న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని అన్నారు. అయితే, వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలపై స్టే విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది.