దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ సాధించిన మైలురాళ్లు ఇవే.. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండేలా..
క్రీడల నుంచి అంతరిక్షం వరకు, అందాల పోటీల నుంచి విజ్ఞాన శాస్త్ర విజయాల వరకు భారత్ ప్రయాణం ప్రతి భారతీయుడికి గర్వకారణం.

indian flag
భారత్ ఇవాళ 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. 1947 ఆగస్టు 15న భారత్ కేవలం స్వేచ్ఛను పొందిన రోజు మాత్రమే కాదు. తన కథను తానే తిరిగి రాయడం ప్రారంభించిన రోజు. ఆ అర్ధరాత్రి నుంచి సాధించిన ప్రతి విజయమూ స్వతంత్ర దేశ గర్వానికి ప్రతీకగా నిలిచింది. కొన్ని విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు గుర్తు చేసుకుందాం..
1948 – బ్రిటన్‌ను హాకీలో ఓడించడం
స్వాతంత్ర్యం వచ్చి ఏడాది గడవకముందే 1948 ఆగస్టు 12న లండన్ వెంబ్లీ స్టేడియంలో భారత్ పురుషుల హాకీ జట్టు బ్రిటన్‌ను 4–0 తేడాతో ఓడించింది.
1951 – తొలి సాధారణ ఎన్నికలు
1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగిన భారత తొలి సాధారణ ఎన్నికల్లో 173 మిలియన్ ఓటర్లు, 1,949 అభ్యర్థులు పాల్గొన్నారు. ఆ కాలంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ.
1952 – తొలి మిస్ ఇండియా పోటీ
1952లో తొలి మిస్ ఇండియా పోటీ జరిగింది. ఇంద్రాణి రెహ్మాన్ గెలిచారు. ఆధునిక మహిళలు, వారి పాత్రలపై ప్రభావం చూపింది.
1959 – తొలి టీవీ ప్రసారం (దూరదర్శన్)
1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో ప్రయోగాత్మకంగా టీవీ ప్రసారం ప్రారంభమైంది. ప్రభుత్వ టీవీ ఛానల్ దూరదర్శన్ ఇది.
1965 – దేశాన్ని ఏకం చేసిన నినాదం
1965లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి “జై జవాన్, జై కిసాన్” నినాదం ఇచ్చారు. ఇది సైనికులు, రైతుల విలువను బలపరిచింది.
1974 – తొలి అణు పరీక్ష “స్మైలింగ్ బుద్ధ”
1974 మే 18న రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లో భారత్ తొలి అణు పరీక్ష నిర్వహించింది. స్మైలింగ్ బుద్ధ అనేది కోడ్ పేరు.
1975 – తొలి ఉపగ్రహం: ఆర్యభట్ట
1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ నుంచి భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగాన్ని చేసింది. ఇది ఇస్రో భవిష్యత్తుకు పునాది వేసింది.
1983 – క్రికెట్‌లో అతిపెద్ద అద్భుతం
1983 జూన్ 25న లండన్ లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌ను భారత్ ఓడించి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది.
1984 – తొలి భారతీయుడు అంతరిక్షంలోకి..
1984 ఏప్రిల్ 3న రాకేశ్ శర్మ సోవియట్ సోయూజ్ T-11 ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
1994 – అంతర్జాతీయ సౌందర్య పోటీలలో కిరీటాలు
1994లో సుష్మితా సేన్ మిస్ యూనివర్స్, ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు.
Also Read: ఈ ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం: సీఎం చంద్రబాబు ప్రసంగం
1995 – భారత తొలి ఇంటర్నెట్ కనెక్షన్
1995 ఆగస్టు 15న VSNL తొలి కమర్షియల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించింది.
1996 – బీఫ్ లేని మెక్‌డొనాల్డ్స్
1996లో ఢిల్లీలోని బసంత్ లోక్‌లో మెక్‌డొనాల్డ్స్ తొలి స్టోర్ ప్రారంభమైంది. మెనూలో బీఫ్ లేదు.
1998 – ప్రపంచ తొలి సంస్కృత దైనందిన పత్రిక
సుధర్మ – మైసూర్ నుంచి 1970 జూలై 14న ప్రచురణ ప్రారంభమైన సంస్కృత దినపత్రిక.
2005 – సమాచార హక్కు చట్టం
2005 అక్టోబర్‌లో అమలులోకి వచ్చిన ఆర్‌టీఐ చట్టం పౌరులకు ప్రభుత్వ సమాచారం కోరే శక్తిమంతమైన హక్కును ఇచ్చింది.
2012 – ప్రపంచంలో అతిపెద్ద ఎన్నిక (ఉత్తరప్రదేశ్)
2012లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో 127 మిలియన్ ఓటర్లు పాల్గొన్నారు. ఇది అసెంబ్లీ స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నిక.
2014 – తొలి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిట్‌లోకి చేరిన ఆసియా దేశం
2014 సెప్టెంబర్ 24న ఇస్రో మంగళ్‌యాన్ కక్ష్యలోకి చేరింది. ఇది ఆసియాలో మొదటి సారి, ప్రపంచంలో తొలి ప్రయత్నంలో సాధించిన ఘనత.
2021 – ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్
2021 జనవరిలో భారత్ COVID-19 వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించింది. లక్షల డోసులు వేగంగా ఇచ్చింది.
2023 – చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి ల్యాండింగ్
2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండ్ అయింది. ఆ ప్రాంతంలో మరే దేశ ల్యాండర్, రోవర్ ల్యాండ్ కాలేదు.
క్రీడల నుంచి అంతరిక్షం వరకు, అందాల పోటీల నుంచి విజ్ఞాన శాస్త్ర విజయాల వరకు భారత్ ప్రయాణం ప్రతి భారతీయుడికి గర్వకారణం.