ఈ ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం: సీఎం చంద్రబాబు ప్రసంగం

దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో ఏపీలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం: సీఎం చంద్రబాబు ప్రసంగం

Updated On : August 15, 2025 / 10:43 AM IST

రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య వేడుకల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ అమలు కాని స్థాయిలో ఏపీలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ హిట్ చేశామని తెలిపారు. 2029 నాటికి అందరికీ ఇళ్లు కల్పించడమే లక్ష్యమని అన్నారు.

Also Read: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురి మృతి.. 18 మందికి గాయాలు

అమరావతి ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉంటుందని హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. 2014లో సీఎంగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, భారత్‌లో టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామని అన్నారు. అనంతరం, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏపీని నాశనం చేసిందని తెలిపారు. ఏపీ బ్రాండ్‌ను వైసీపీ నాశనం చేసిందని, దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని అన్నారు.