Lok Sabha elections 2024: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Lok Sabha elections 2024: ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది.

దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ దశలో బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది. బిహార్ లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఎన్నికల వేళ తెలంగాణకు వరుసగా బీజేపీ అగ్రనేతల రాక..

ట్రెండింగ్ వార్తలు