Viral Video: భారతీయ అధికారి తనతో ప్రవర్తించిన తీరుపై రష్యా అమ్మాయి ఆగ్రహం
ఆ అధికారి ప్రవర్తన సరైనదేనా? అని నిలదీసింది. తాను షాక్ అయ్యానని పేర్కొంది.
- T Venkateshwarlu
- Published On : April 28, 2024 / 04:56 PM IST
dinara
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పాస్‌పోస్ట్ ఆఫీసర్ తనతో అభ్యంతరకర రీతిలో మాట్లాడారని ఓ రష్యా అమ్మాయి తెలిపింది. తనను కాల్ చేయాలని కోరాడని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది.
రష్యాకు చెందిన కంటెంట్ క్రియేటర్ దినారా అనే అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 80,000కు మించి ఫాలోవర్లు ఉన్నారు. పలు దేశాలను ఆమె సందర్శిస్తుంటుంది. భారతదేశం అంటే ఎంతో ఇష్టమని చెబుతుంటుంది.
తాజాగా ఓ వీడియో రూపంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పాస్‌పోస్ట్ ఆఫీసర్ వద్దకు వెళ్లినప్పుడు.. ఆ అధికారి తన బోర్డింగ్ పాస్‌లో అతడి ఫోన్ నంబర్‌ను రాశాడని తెలిపింది. మరోసారి భారత్ కు వచ్చినప్పుడు తనకు కాల్ చేయాలని చెప్పాడని వివరించింది. ఆ అధికారి ప్రవర్తన సరైనదేనా? అని నిలదీసింది. తాను షాక్ అయ్యానని పేర్కొంది.
ఆమె చేసిన పోస్ట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఆ అధికారి ప్రవర్తించిన తీరు సరైంది కాదని కొందరు అంటున్నారు. అతడి ప్రవర్తన అనుచితమని కొందరు కామెంట్లు చేశారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అతడు ఏదైనా సాయం కావాలంటే అడగాలంటూ ఫోన్ నంబరు అలా రాసిచ్చాడేమో అంటూ కొందరు కామెంట్లు చేశారు.
Viral Video: ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. బ్రిడ్జిపై యువకుడు మృతి
