Mahanandi Temple: మహానందిలో మరోసారి చిరుత కలకలం

తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

నంద్యాల జిల్లాలోని మహానందిలో మరోసారి చిరుత కలకలం రేగింది. మహనందిలోనే అది తిష్ట వేసింది. గత రాత్రి మేకపై దాడి చేసి దాన్ని తినేసింది. మేకను చిరుత తింటుండగా స్థానికులు వీడియో తీశారు. చిరుత గాండ్రిస్తూ మేకను తిన్నట్లు దాని ద్వారా తెలుస్తోంది.

తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మహానంది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత. వరుస దాడులతో నిద్రాహారాలు మానుకుని రాత్రి వేళల్లో భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు బతుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫారెస్ట్ అధికారులకు ఎన్ని సార్లు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని చెబుతున్నారు. నెలల తరబడి చిరుత తిరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాత్రి పూట పిల్లలపై దాడి చేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

చిరుతను బంధించి పట్టుకెళ్లాలని కోరుతున్నారు. గత రాత్రి క్షేత్ర పరిధిలోని గోశాల వద్ద కూడా చిరుత కనపడింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొన్ని వారాల తరబడి చిరుత దాడులు చేస్తోందని స్థానికులు అంటున్నారు.

Also Read: ముంబైలో బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. ఒకరు మృతి

ట్రెండింగ్ వార్తలు