Pawan Kalyan – Sai Durgha Tej : పవన్ కళ్యాణ్ నిర్మాతగా సాయి దుర్గ తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా.. కానీ..
తాజాగా సాయి ధరమ్ తేజ్ ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాగా ఈ సినిమా డైరెక్టర్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
- Saketh U
- Published On : July 29, 2024 / 03:30 PM IST
Sai Dharam Tej Pawan Kalyan Interesting Thing said by Director Vijay Bhaskar
Pawan Kalyan – Sai Durgha Tej : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మామ అల్లుళ్లుగా బాగా క్లోజ్ అని అందరికి తెలిసిందే. అనేక ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ఈ విషయం కూడా చెప్పారు. జనసేన విజయం సాధించినప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాగా ఈ సినిమా డైరెక్టర్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావలి.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన స్టార్ దర్శకుడు విజయ్ భాస్కర్ ఇప్పుడు తన కొడుకు శ్రీ కమల్ ని హీరోగా పెట్టి ఉషా పరిణయం అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అసలు సాయి ధరమ్ తేజ్ ని సినీ పరిశ్రమకు నేను పరిచయం చేయాలి. సాయి ధరమ్ తేజ్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. సాయి ధరమ్ తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా నా దర్శకత్వంలో ఒక సినిమా అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మొదలవ్వలేదు. అదే కథని నేను ఆదితో ప్రేమ కావాలి అనే సినిమా చేసాను అని తెలిపారు. దీనికి సాయి ధరమ్ తేజ్ సమాధానమిస్తూ.. అది షిఫ్ట్ అయింది. ఆది ‘రేయ్’ సినిమా చేయాలి. నేను ప్రేమ కావాలి సినిమా చేయాలి కానీ అనుకోకుండా షిఫ్ట్ అయ్యాయి అని చెప్పాడు. దీంతో ఆది సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమా చేసుంటే ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయ్యేది. ప్రేమ కావాలితో మంచి హిట్ కొట్టాడు. సాయి తేజ్ రేయ్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు మంచి హీరోగా నిలదొక్కుకున్నాడు.
