Chiranjeevi Wife : పారిస్ ఒలంపిక్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ కోసం.. బ్యాగ్ నిండా ఫుడ్ తీసుకెళ్లిన చిరంజీవి భార్య..

పారిస్ ఒలంపిక్స్ లో ప్లేయర్స్ ఉండే చోట ఇండియన్ ఫుడ్ లేదు.

Chiranjeevi Wife : పారిస్ ఒలంపిక్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ కోసం.. బ్యాగ్ నిండా ఫుడ్ తీసుకెళ్లిన చిరంజీవి భార్య..

Chiranjeevi Wife Surekha gives Indian Food for Indian Players in Paris Olympics

Chiranjeevi Wife : పారిస్ లో ఒలంపిక్స్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. పారిస్ ఒలంపిక్స్ కి మెగా ఫ్యామిలీ కూడా వెళ్లారు. గత మూడు రోజులుగా చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన.. నలుగురూ కలిసి పారిస్ ఒలంపిక్స్ లో సందడి చేస్తున్నారు. ఇక PV సింధు మెగా ఫ్యామిలీకి క్లోజ్ అని తెలిసిందే. ఈ క్రమంలో PV సింధు వెంటే ఉండి ఆమెకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ.

పారిస్ ఒలంపిక్స్ లో ప్లేయర్స్ ఉండే చోట ఇండియన్ ఫుడ్ లేదు. ఈ విషయం PV సింధు చెప్తుండగా ఉపాసన వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే ఇంకో స్టోరీలో ఇండియన్ ప్లేయర్స్ కోసం అత్తమ్మాస్ కిచెన్ నుంచి తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ చూపించింది.

Also See : Mega Family : పారిస్ ఒలంపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. ఫొటోలు వైరల్..

ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇండియన్ ట్రెడిషన్ ఇన్‌స్టంట్ ఫుడ్ తో పాటు పచ్చడ్లు, పొడులు.. ఇలా పలు ఐటమ్స్ అమ్ముతారు. అయితే ఇండియా నుంచి బోలెడన్ని ఉప్మా, పులిహార, పచ్చడ్లు.. ఇలా రకరకాల ఇన్‌స్టంట్ ఫుడ్స్ ప్యాకెట్స్ బ్యాగ్ నిండా తీసుకెళ్లారు మెగా ఫ్యామిలీ. ఆ బ్యాగ్ ని కూడా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది ఉపాసన. ఆ ఫుడ్ అంతా అక్కడ ఉన్న ఇండియన్ ప్లేయర్స్ కి ఇవ్వనున్నారు మెగా ఫ్యామిలీ. దీంతో ఇండియన్ ప్లేయర్స్ కి ఇండియా ఫుడ్ తీసుకెళ్లి పెట్టినందుకు మరోసారి అభిమానులు, నెటిజన్లు మెగా ఫ్యామిలీని అభినందిస్తున్నారు. పనిలో పని అత్తమ్మాస్ కిచెన్ ప్రమోషన్ కూడా అవుతుందని భావిస్తున్నారు.

Chiranjeevi Wife Surekha gives Indian Food for Indian Players in Paris Olympics