Tati Munjalu: చెట్టుకే పరిమితమవుతోన్న తాటి ముంజలు

ఐస్‌ ఆపిల్‌గా పిలిచే తాటి ముంజలపై కరోనా ప్రభావం పడింది. ఏటా వేసవిలో చల్లగా సేద తీర్చే తాటి ముంజలు ఈ ఏడాది అసలు కనిపించడం లేదు.

Tati Munjalu: ఐస్‌ ఆపిల్‌గా పిలిచే తాటి ముంజలపై కరోనా ప్రభావం పడింది. ఏటా వేసవిలో చల్లగా సేద తీర్చే తాటి ముంజలు ఈ ఏడాది అసలు కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో చెట్ల నుంచి కాయలు దించే వారు కరువయ్యారు.

దూరాభారం నుండి మార్కెట్‌కు తీసుకొచ్చినా ప్రస్తుతం జనసంచారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వ్యాపారం జరుగుతుందో లేదోనని సీజనల్‌ వ్యాపారులు మిన్నకుంటున్నారు. ఫలితంగా తాటి ముంజలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి.

వేసవిలో లభ్యమయ్యే వాటిలో ఒకటైన తాటి ముంజ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుండి ఉపశమనం ఇస్తుంది. అందుకనే దీన్ని ఐస్‌ యాపిల్‌ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి.

వీటిల్లో క్యాలరీలు తక్కువే. ముంజలపై తెల్లగా ఉండే పై పొరతో పాటుగా తింటే శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా రక్షణనిస్తాయి.

శరీరానికి కావాల్సిన ఏ, బీ, సీ విటమిన్లతోపాటు కరోనా కాలంలో విస్తృతంగా వాడుతున్న ఐరన్, జింక్, ఫాస్పరస్, క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధుల్ని తగ్గించే పొటాషియం ముంజల్లో పుష్కలంగా లభిస్తుంది. శరీర బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. చికెన్‌పాక్స్‌ లాంటి వైరస్‌తో బాధ పడేవారికి ఒంటిపైన వీటితో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు