TS Inter Results : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

TS Inter Results 2024 Live Update : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.

 

  • ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ కోర్సుల ఫలితాలను కలిపి ప్రకటించారు.
  • ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణత 60.01శాతం(2,87,261 మంది విద్యార్థులు పాస్)
  • ఇంటర్ సెకండియర్ లో ఉత్తీర్ణత 64.19శాతం.(3,22,432 మంది విద్యార్థులు పాస్).
  • మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు 68.35శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే.. బాలురు 51.5శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలు 72.52శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. బాలురు 56.1శాతం ఉత్తీర్ణత సాధించారు.
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో రంగారెడ్డి (71.7శాతం), మేడ్చల్ (71.58శాతం) జిల్లాలు నిలిచాయి. అదేవిధంగా ఒకేషనల్ ఫలితాల్లో నారాయణపేట, మెదక్ జిల్లాలు ఉన్నాయి.
  • ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ ఫలితాల్లో మొదటి స్థానంలో ములుగు (82.95శాతం) జిల్లా నిలిచింది.

 

రీ కౌంటింగ్, పేపర్ రీ వాల్యూయేషన్ కోసం ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం ఉందని, ఒక్కో పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in  లేదా results.cgg.gov.in వెబ్ సైట్ లలో చూడొచ్చు. లేదా 04024655027 నెంబర్ కు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. 

 

ట్రెండింగ్ వార్తలు