Virat kohli : టెస్ట్ సిరీస్‌ కోసం సౌతాఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

ఈనెల 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టులో భాగస్వామ్యం అయ్యేందుకు కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు.

IND Vs SA: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఈనెల చివరివారంలో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వన్డే వరల్డ్ కప్ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తరువాత కోహ్లీ ఇప్పటి వరకు టీమిండియాలో భాగస్వామి కాలేదు. ప్రస్తుతం టీమిండియా జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ తో టీ20 సిరీస్ ను పూర్తిచేసుకుంది. ఈ సిరీస్ లో సౌతాఫ్రికా, ఇండియా జట్లు 1-1 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఈనెల 17 నుంచి వన్డే సిరీస్ జరగనుంది.

Also Read : MS Dhoni Jersey : సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం

డిసెంబర్ 17న తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. రెండో వన్డే డిసెంబర్ 19న, మూడో వన్డే డిసెంబర్ 21న జరుగుతుంది. ఆ తరువాత టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ టీమిండియా జట్టులో జాయిన్ కానున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరువాత స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడింది. ఆస్ట్రేలియాతోపాటు సౌతాఫ్రికాలో టీమిండియా టీ20, వన్డే సిరీస్ జట్టులో కోహ్లీ ఎంపిక కాలేదు. సెలెక్టర్లు విరాట్ కు విశ్రాంతి ఇచ్చారు. టెస్టె సిరీస్ కోసం టీమిండియా జట్టులో కోహ్లీ ఎంపికయ్యాడు.

Also Read : Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..

ఈనెల 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ జట్టులో భాగస్వామ్యం అయ్యేందుకు కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ముంబయి ఎయిర్ పోర్టులో కోహ్లీ వేచిఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 – 30వ తేదీ వరకు, రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి 3 – 7 వరకు జరుగుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు