ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై అఫ్గానిస్థాన్ విజయం.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్

టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించింది.

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భాగంగా సూపర్ -8లో బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్థాన్ జట్ల మధ్య మంగళవారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్ లోకి అడుగు పెట్టింది. గ్రూప్ -1 నుంచి భారత్ తో పాటు అఫ్గానిస్థాన్ జట్టుకూడా సెమీస్ లోకి వెళ్లింది. అఫ్గాన్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో టోర్నీ నుంచి ఆసీస్ నిష్క్రమించింది. ఇప్పటికే గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరుకోగా.. గ్రూప్ -1 నుంచి ఇండియా, అఫ్గానిస్థాన్ జట్లు సెమీస్ లోకి అడుగు పెట్టాయి.

Also Read : సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనున్న టీమిండియా.. మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ (43), రషీద్ ఖాన్ (19) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు రాణించలేక పోయారు. 116 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టుకు ఆదినుంచి ఎదురుదెబ్బలే తగిలాయి. లిట్టన్ దాస్ (54 నాటౌట్) మినహా బంగ్లా బ్యాటర్లు రాణించలేక పోయారు. మధ్యలో వర్షం రావడంతో డీఎల్ఎస్ ద్వారా మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించి 114 పరుగులు టార్గెట్ విధించారు. అయితే, 17.5 ఓవర్లలో 105 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది. దీంతో ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించింది. అఫ్గాన్ బౌలర్లు నవీన్-ఉల్-హక్, రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్ తో చెరో నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా బ్యాటర్లను వరుసగా పెవిలియన్ బాట పట్టించారు.

Also Read : బౌండరీ వద్ద ఒంటి చేత్తో అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

సెమీఫైనల్ లో అడుగుపెట్టిన జట్లు ఇవే.. 
గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్
గ్రూప్ 2 నుంచి దక్షిణాప్రికా, ఇంగ్లాండ్

సెమీ ఫైనల్-1లో దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్.
సెమీ ఫైనల్-2లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.

జూన్ 27న ఉదయం 6గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
జూన్ 27న రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

ఈరెండు మ్యాచ్ లలో విజయం సాధించిన జట్లు 29వ తేదీ (శనివారం) జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు