సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనున్న టీమిండియా.. మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?

గ్రూప్ -1 విభాగం నుంచి ఇండియా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-8 విభాగంలో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు..

సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనున్న టీమిండియా.. మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?

India vs England

Updated On : June 25, 2024 / 8:05 AM IST

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ సూపర్ -8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. సూపర్ -8 విభాగంలో గ్రూప్ -2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టాయి. సూపర్ -8లో దక్షిణాఫ్రికా జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించి ఆరు పాయింట్స్ లో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచ్ లలో రెండింటిలో విజయం సాధించి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ రెండు జట్లు గ్రూప్ -2 నుంచి సెమీస్ కు చేరాయి.

Also Read : బౌండరీ వద్ద ఒంటి చేత్తో అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

గ్రూప్ -1 విభాగం నుంచి ఇండియా సెమీస్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-8 విభాగంలో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు.. అన్నింటిలో విజయకేతనం ఎగురవేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1 లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లలో ఏదో ఒకటి చేరుతుంది. అయితే, గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉన్న భారత్ జట్టు.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. అంటే.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోబోతుంది.

Also Read : IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

సెమీ ఫైనల్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈనెల 27వ తేదీ (గరువారం) రాత్రి 8గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే రోజు 80శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. ఫైనల్ కు చేరేందుకు టీమిండియాకే అవకాశం ఉంటుంది.