IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

సూప‌ర్ 8లో భాగంగా సెయింట్ లూసియా వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

IND vs AUS: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

pic credit : BCCI

భారత్ చేతిలో ఆసీస్ చిత్తు..
టీ20 వరల్డ్ కప్ సూపర్ -8లో.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. 206 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులే చేసింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లతో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

206 పరుగుల లక్ష్యం
ఆస్ట్రేలియా ముందు టీమిండియా 206 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ 92, కోహ్లీ 0, పంత్ 15, సూర్యకుమార్ 31, దుబే 28, పాండ్యా 26, రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. అయితే, 40 బంతుల్లో 92 పరుగులు బాది ఔటయ్యాడు.

కోహ్లి డ‌కౌట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో విరాట్ కోహ్లి (0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 1.4వ ఓవ‌ర్‌లో 6 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Australia vs India : సూప‌ర్ 8లో భాగంగా సెయింట్ లూసియా వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు ఎంతో కీల‌కం. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా సెమీ ఫైన‌ల్ బెర్తును ఖరారు చేసుకోవాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది. మ‌రోవైపు ఆస్ట్రేలియా సెమీ ఫైన‌ల్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం త‌ప్ప‌ని స‌రి. లేదంటే ఇంటి బాట ప‌ట్టాల్సిందే. ఈ కీల‌క మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.