రోహిత్ శర్మ పవర్‌ఫుల్ హిట్టింగ్.. రితిక రియాక్షన్ చూశారా?

లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌ ఎదుర్కొవడంలో రోహిత్ శర్మ తడబడతాడని అంటుంటారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో రెచ్చిపోయాడు.

how Ritika Sajdeh Reacts on Rohit Sharma Dispatches Mitchell Starc

Ritika Sajdeh Reaction: టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ 1లో 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన సూపర్ -8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించింది. హిట్‌మాన్‌ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి సత్తా చూపించాడు. పవర్‌ఫుల్ షాట్లతో ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌ ఎదుర్కొవడంలో రోహిత్ శర్మ తడబడతాడని క్రికెట్ ఎనలిస్టులు అంటుంటారు. కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో 4 సిక్స్‌లు, ఫోర్‌తో 29 పరుగులు బాదాడు. తన భర్త పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ చూసి స్టాండ్స్‌లో ఉన్న రోహిత్ భార్య రితిక సజ్దేహ్ ఉప్పొంగిపోయింది. రోహిత్ శర్మ సిక్స్ కొట్టిన ప్రతిసారి ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు రితిక చాలా ఉత్సాహంగా కనిపించింది. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో రితిక సంతోషం రెట్టింపయింది.

Also Read : ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై అఫ్గానిస్థాన్ విజయం.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్

కాగా, గురువారం రాత్రి 8గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడుతుంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో సాతాఫ్రికాతో అఫ్గానిస్థాన్ పోటీ పడనుంది.