వైరల్ ఫోటోలు : అరుదైన వింత ’డైనోసార్ తాబేలు‘..

  • Publish Date - September 3, 2020 / 01:14 PM IST

తాబేలుని చూడగానే చాలా అమాయకంగా కనిపిస్తుంది.కానీ ఇటీవలే పరిశోధకులు కనుగొన్న ఓ అరుదైన వింత..విచిత్రమైన తాబేలు తాబేలుని చూస్తే మాత్రం కాస్త భయపడాల్సిందే. చూడ్డానికి అది కాస్త భయంకరంగానే ఉంది. చూడటానికి మొసలిలా ఉన్నా ఎవర్నీ ఏమీ చేయదు ఈ తాబేలు.




https://10tv.in/internet-speed-record-shattered-at-178-terabits-per-second/
ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్‌లోని పరిశోధకులు… ఈ అతి పెద్ద అరుదైన భారీ తాబేలును కనుక్కున్నారు. ఇది సువాన్నీ తాబేలు అని పరిశోధకులు తెలిపారు. ఇది 45 కేజీల బరువుంది. పరిశోధకులు వేసిన వలలో… మరో రెండు మామూలు తాబేళ్లతో పాటు ఈ అరుదైన సువాన్నీ తాబేలు కూడా చిక్కింది. దాన్ని ఆసాంతం పరిశీలించిన పరిశోధకులు పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసి..తిరిగి నీటిలో వదిలేశారు. ఆ ఫొటోలను ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి.



2014 ఇలాంటి తాబేలును పరిశోధకులు చూశారు. మళ్లీ ఇప్పుడు అదే జాతికి చెందిన సువాన్నీ తాబేలు కనిపించి కనువిందు చేసింది. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో ఇలాంటి జాతి తాబేళ్లు ఎన్ని ఉన్నాయి? వాటి బరువెంత అనే అంశంపై ఇప్పుడు పరిశోధన జరుపుతున్నారు.



న్యూ రివర్‌లో కనిపించిన ఈ తాబేలు 4 అడుగుల పొడవుతో 45 కేజీల బరువు ఉంది. కానీ చిన్న కాలువలా ఉన్ననీటి ప్రవాహంలో ..ఇంత పెద్ద తాబేలు ఉండటం చిత్రమే అంటున్నారు పరిశోధకులు.



కాగా..ప్రస్తుతం ప్రపంచంలో… మొసళ్లలా కనిపించే తాబేళ్లు ఇవి మాత్రమే బతికివున్నాయి. ఇవి ఎక్కువగా అమెరికా… దక్షిణ, తూర్పు జలాల్లో కనిపిస్తాయనీ..ఈ తాబేళ్లను తాబేళ్ల ప్రపంచంలో డైనోసార్లు అని కూడా అంటారు. ఇవి దాదాపు 70 ఏళ్ల దాకా బతుకుతాయని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు