Suhas : సుహాస్‌కి పొలిటికల్ పార్టీ ఆఫర్.. ఎన్నికల ప్రచారం చేస్తే భారీగా ఇస్తామని..

ప్రసన్న వదనం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Suhas Interesting comments regarding Elections in Prasanna Vadanam Promotions

Suhas : షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్. ఇటీవలే ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం సినిమా హిట్ తో మరో హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు.

ఈ ప్రసన్న వదనం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఎన్నికల సమయం కదా మీ దాకా ఏమన్నా వచ్చిందా ఎలక్షన్ ఎఫెక్ట్ అని అడగ్గా సుహాస్ మాట్లాడుతూ.. ఓ రోజు మా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇలా ఓ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారా అని అడిగారట, అమౌంట్ కూడా భారీగానే ఇస్తామని చెప్పారంట. నాకు డౌట్ వచ్చి నన్నేనా అని అడిగాను. మిమ్మల్నే సర్ అని చెప్పాడు. నాకు మాములుగా సినిమా ఈవెంట్స్ లోనే మాట్లాడటం రాదు. ఇంకా ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతాను. ఒకవేళ నేను వెళ్లినా సరిగ్గా మాట్లాడటం రాని వాడ్ని తెచ్చుకున్నారని తిడతారు. ఆ ఆఫర్ కి నేను నో చెప్పాను అని తెలిపాడు.

Also Read : Ram Charan – Kamal Haasan : కమల్ హాసన్‌కు రామ్ చరణ్ సాయం.. శంకర్ అడిగాడని.. అదే జరిగితే చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

భవిష్యత్తులో ఏమైనా పాలిటిక్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎవరి కోసమైనా ప్రచారం చేసే ఛాన్స్ ఉందా అని అడగ్గా.. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన లేదు అని తెలిపాడు సుహాస్. అయితే సుహాస్ ని ప్రచారంలో పాల్గొంటే భారీగా డబ్బులు ఇస్తామని ఏ పార్టీ అడిగిందో మాత్రం చెప్పలేదు.