Ram Charan – Kamal Haasan : కమల్ హాసన్‌కు రామ్ చరణ్ సాయం.. శంకర్ అడిగాడని.. అదే జరిగితే చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.

Ram Charan – Kamal Haasan : కమల్ హాసన్‌కు రామ్ చరణ్ సాయం.. శంకర్ అడిగాడని.. అదే జరిగితే చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

Ram Charan Helping to Shankar Kamal Haasan Indian 2 Movie Rumours goes Viral

Ram Charan – Kamal Haasan : రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే శంకర్ చేతిలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొన్ని రోజులు గేమ్ ఛేంజర్ సినిమా పక్కన పెట్టి ఇండియన్ 2 షూటింగ్ చేసారు శంకర్. గేమ్ ఛేంజర్ కంటే కూడా ఇండియన్ 2 (Indian 2)సినిమా ముందు రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమాకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. ఇండియన్ 2 సినిమాలో ఓ వాయిస్ ఓవర్ ఉంది. అయితే దాన్ని రామ్ చరణ్ తో చెప్పిస్తే బాగుంటుంది అని శంకర్ ఫీల్ అయి చరణ్ ని అడిగితే ఒప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read : Pawan Kalyan : ఆ యాడ్‌కి షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తా అన్నారు.. అయినా నో చెప్పాను..

దీంతో ఇండియన్ 2 సినిమాకు అన్ని భాషల్లోనూ చరణ్ వాయిస్ తో వాయిస్ ఓవర్ చెప్పించేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుంది. త్వరలోనే చరణ్ ఆ వాయిస్ ఓవర్ కి డబ్బింగ్ చెప్తాడని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. ఇదే నిజమయి ఇండియన్ 2 సినిమాకు రామ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తే కలెక్షన్స్ ఇంకొంచెం పెరిగినట్టే. చరణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫిదా అయిపోతారు. మరి నిజంగానే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా అంటే ఎదురుచూడాల్సిందే.