Pawan Kalyan : ఆ యాడ్‌కి షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తా అన్నారు.. అయినా నో చెప్పాను..
తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ యాడ్స్ గురించి ప్రస్తావించారు.

Pawan Kalyan Sensational Comments on Ads and Remunerations
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగి స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టార్స్ అంతా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం యాడ్స్ చేయరు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఓ 20 ఏళ్ళ క్రితం కోలా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్ మొదటి, చివరి యాడ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాడ్స్ చేయలేదు.
దీనిపై పవన్ కళ్యాణ్ ని గతంలో పలు ఇంటర్వ్యూలలో అడిగితే.. ఆ కోలా వల్ల హెల్త్ సమస్యలు వస్తాయి. ప్రజలకు మంచిది కానప్పుడు నేను చేయకూడదు డబ్బుల కోసం అని తెలిపారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాడ్స్ గురించి ప్రస్తావన వచ్చింది.
Also Read : Getup Srinu : 24 గంటలు కంటిన్యూ షూట్.. ఆ నొప్పులతో ఆర్టిస్ట్‌గా ఫెయిల్ అయిపోతానేమో అనిపించింది..
పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తూ.. నేను గతంలో ఓ కోలా యాడ్ చేసాను. కోలాల వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆ యాడ్ వదిలేసాను. ఆ తర్వాత షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) కి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఇస్తాను అన్నారు. ఆ యాడ్ కంటిన్యూ చేయమని అడిగారు. కానీ నేను నో చెప్పాను. నేను నా నమ్మకాలు వదిలేసి డబ్బుల కోసం యాడ్స్ చేసి ఉంటే బోల్డంత డబ్బు సంపాదించేవాడిని అని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి పవన్ చేస్తానంటే చాలా కంపెనీలు తమకు యాడ్స్ చేయించుకోడానికి రెడీగా ఉన్నాయి. కానీ పవన్ యాడ్స్ కి ఎప్పుడో నో చెప్పారు.